Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ పై అటు అభిమానుల్లో , ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఖరారై 15 ఏళ్ళు అయ్యింది. కానీ రాజమౌళి తన కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకొని , పాన్ వరల్డ్ స్థాయికి తన ఇమేజ్ ని పెంచుకున్న తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఇన్నేళ్ల మహేష్ బాబు అద్భుతమైన ఫిల్మోగ్రఫీ కి ఎలాంటి గౌరవం దక్కాలో , అలాంటి గౌరవం ఇప్పుడు వారణాసి చిత్రం రూపం లో దక్కబోతోంది. ఈ సినిమాతో మహేష్ బాబు తన స్థాయిని అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్ళబోతున్నాడని , ఇకపై ఆయన సినిమాలు హాలీవుడ్ తోనే పోటీ పడుతాయని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ‘వారణాసి’ చిత్రం గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం లీక్ అయ్యింది. ఇంటర్వెల్ లో వచ్చే కీలక ట్విస్ట్ , అందులో రాజమౌళి విజన్ ని చూసి , ప్రపంచం లో ఉన్నటువంటి మూవీ లవర్స్ అందరూ సెల్యూట్ చేస్తారని , ఈ స్థాయి ఇంటర్వెల్ బ్లాక్ గ్లోబల్ సినిమాలోనే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ తెరకెక్కించలేదని, ఈ ఒక్క సన్నివేశం కోసమైనా ఒకటికి పది సార్లు థియేటర్స్ కి వెళ్లి ఆడియన్స్ చూస్తారని , అంతటి బలమైన ఇంప్యాక్ట్ కలిగించే సన్నివేశామని అంటున్నారు. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్ సన్నివేశాలు సాధారణంగానే వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటిది అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్న ‘వారణాసి’ లో ఎలాంటి ఇంటర్వెల్ ని ప్లాన్ చేసి ఉంటాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యినట్టే అని అంటున్నారు. అక్టోబర్ నెలలో ప్యాచ్ వర్క్స్ మొత్తాన్ని పూర్తి చేస్తారట మేకర్స్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జెట్ స్పీడ్ లో పూర్తి చేసి , డిసెంబర్ నాటికి మొదటి కాపీ సిద్ధం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ప్రొమోషన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతున్నాయట. అందుకోసం ఏకంగా నాలుగు నెలల సమయాన్ని కేటాయించినట్టు సమాచారం. ఓవరాల్ గా ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల చేసేలా అన్ని విధాలుగా ప్లానింగ్ ని రెడీ చేసాడట రాజమౌళి.