Prudhvi Raj: రాజమౌళి తో సినిమా అంటే చిన్న విషయం కాదు. ఒక సాధారణ హీరో ని అసాధారణ హీరో గా మలిచే కెపాసిటీ ఆయనకు ఉంది. అందుకే అందరూ ఆయనతో సినిమా చేయడాన్ని ఒక డ్రీం గా భావిస్తుంటారు. కానీ ఒక్కసారి ఆయన మూవీ సెట్స్ లోకి నటీనటులు అడుగుపెట్టిన తర్వాత , జైలు లోకి అడుగుపెట్టినట్టే లెక్క. తన సినిమాలో నటిస్తున్న హీరో , విలన్ , హీరోయిన్స్ ని సమాంతరంగా మరో సినిమా లో నటించేందుకు అసలు అనుమతి ఇవ్వడు రాజమౌళి. అయితే ‘వారణాసి’ విషయం లో ఆయన పెట్టుకున్న రూల్స్ ని కాస్త సడలించినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా మలయాళం బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన పృథ్వి రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ , థీమ్ సాంగ్ వంటివి కూడా విడుదలై సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఆయనకు సంబంధించిన చివరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే పృథ్వి రాజ్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి , ఈ ఏడాది వరకు దాదాపుగా 9 సినిమాలను విడుదల చేశాడు. తన సినిమా షూటింగ్ సమయం లో మరో సినిమా చేయడానికి వీలు లేదని రాజమౌళి పెట్టిన స్ట్రిక్ట్ రూల్ ని పృథ్వి రాజ్ లెక్క చేయలేదు. రాజమౌళి కూడా పృథ్వి రాజ్ కి అలాంటి బలమైన నియమాలు పెట్టలేదు, అందుకే ఆయన ఇంత స్వేచ్ఛ గా వేరే సినిమాలు చేసుకోగలిగారు. విలన్ కి అలాంటి సౌకర్యం ఇచ్చిన రాజమౌళి , హీరో మహేష్ బాబు కి కూడా ఇవ్వొచ్చు కదా. ఖాళీ సమయం లో షూటింగ్ చేసుకున్నా ‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి కమర్షియల్ సినిమాని పూర్తి చేసి , ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల చేసి ఉండొచ్చు.
అలాంటి అరుదైన అవకాశాన్ని మాకు దక్కనివ్వకుండా చేసాడు రాజమౌళి అంటూ సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎక్కువగా VFX ఎఫెక్ట్స్ మీద ఆధారపడిన సినిమా కాబట్టి , ఏప్రిల్ 7 న విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ దీపావళి కి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.