Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం గురించి మీరెంత ఊహించుకున్నా , అంతకు మించే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే , వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే , ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియా లో లేటెస్ట్ గా లీక్ అయ్యాయి. కొన్ని షూటింగ్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో వారణాసి సెట్స్ ని చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. వారణాసి సిటీ లోకి డైనోసార్ వచ్చినట్టు ఒక సెట్ ని డిజైన్ చేసాడు రాజమౌళి. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ఈ సినిమాలో డైనోసార్స్ కూడా ఉంటాయి అనే విషయం లీకై చాలా రోజులైంది. ఇది కేవలం గాసిప్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే షూటింగ్ లొకేషన్ లో వాటికి సంబంధించిన సెట్ పీసెస్ ఉండడం షాక్ కి గురి చేసింది. అసలు ఏమి ప్లాన్ చేస్తున్నారు?, గ్లోబ్ ట్రోటర్ అంటారు, టైం ట్రోటర్ , రామాయణం కి లింక్ ఉందని అంటారు , మళ్లీ డైనోసార్స్ కూడా ఉంటాయని అంటారు, అసలు ఈ సినిమాలో ఏమి చూపించబోతున్నారు?, ఊహిస్తుంటేనే మతి పోతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు , ఈ సినిమా కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు , వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా , ఏప్రిల్ 7 వరకు ఆగాలా? , సమయం ఎందుకు ఇంత ఆలస్యం గా రన్ అవుతుంది అని అనిపించక తప్పదు.
ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు 90 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. మరో రెండు రోజుల్లో విలన్ గా నటిస్తున్న పృథ్వి రాజ్ కి సంబంధించిన షూట్ పార్ట్ పూర్తి అవుతుందట. ఆ తర్వాత కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందని, అక్టోబర్ కి సినిమా మొత్తం రెడీ అవుతుందని , డిసెంబర్ నెలాఖరుకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యి, మొదటి కాపీ రెడీ అవుతుందని , ఆ తర్వాత నాన్ స్టాప్ గా నాలుగు నెలల పాటు ప్రొమోషన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.