Tollywood Heroine : ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా ముఖ్యంగా డేటింగ్ రూమర్స్ తోనే బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉండి ఈ బ్యూటి. చిన్నప్పటి ఫోటోలో ఎంతో క్యూట్గా, ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. కానీ హీరోయిన్ గా మాత్రం ఇప్పటివరకు ఈ అమ్మడు సరైన క్రేజ్ అందుకోలేకపోయింది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫాలోయింగ్ చేస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నిత్యం తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉండిపోయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఈ హీరోయిన్ కు కెరియర్ ప్రారంభంలోనే ఇద్దరు స్టార్ హీరోలతో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఈ హీరోయిన్ మరెవరో కాదు కుర్రాళ్ల దిల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్. బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ హైదరాబాద్ లోనే పెరిగింది.
Also Read : హీరో కాకపొయ్యుంటే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని..ఆ పార్టీ లో చేరేవాడిని అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్!
చదువుకుంటున్న సమయంలో నటనపై తనకున్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందడంతో నిధి అగర్వాల్ కు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత ఈ అమ్మడు హీరో రామ్ పోతినేని కు జోడిగా ఈ స్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది.
దాంతో నిధి అగర్వాల్ క్రేజ్ ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినప్పటికీ తమిళ్లో మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. ఆ సమయంలోనే హీరో శంభు తో ఈమె ప్రేమలో పడిందని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై నిధి అగర్వాల్ క్లారిటీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు జోడిగా రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది నిధి అగర్వాల్
Also Read : కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ప్రస్తుతం రూ. 4600 కోట్లు ఆస్తి ఉన్న ధనిక హీరోయిన్.. ఎవరో తెలుసా…
View this post on Instagram