Nagarjuna: స్టార్ హీరోలందరు కూడా రెమ్యూనరేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రొడ్యూసర్లతో రెమ్యునరేషన్ కి సంబంధించిన వివరాలను తెలుసుకొని అడ్వాన్స్ గా ఎంత తీసుకోవాలి. సినిమా 50% పూర్తయిన తర్వాత ఎన్ని డబ్బులు ఇస్తారు..సినిమా రిలీజ్ కి ముందు బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేయాలి అంటూ కొన్ని అగ్రిమెంట్లు రాసుకుంటారు. అది హీరోలకు చాలావరకు బెనిఫిట్ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున లాంటి నటుడు సైతం కెరియర్ స్టార్టింగ్ లో రెమ్యూనరేషన్ విషయంలో లైట్ గా తీసుకునేవాడట. దానివల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు అతనికి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేవారంటూ కొన్ని వార్తలైతే వచ్చేవి. దాంతో ఆయన స్టార్ హీరో అయినప్పటి నుంచి రెమ్యునరేషన్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఆయన తన రెమ్యూనరేషన్ ను మాట్లాడుకొని ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారు. అనేదానిమీద కూడా ఒక అగ్రిమెంట్ ని రెడీ చేసుకొని ఆ తర్వాత సెట్ లోకి అడుగుపెడతారట. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున అనే కాదు ఎప్పుడైనా స్టార్ హీరోలందరు కూడా అలానే చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్లు హీరోలకు రెమ్యునరేషన్ ని ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. దీనివల్ల హీరోలు చాలా వరకు సఫర్ అవుతున్నారు.
అందుకే ముందే రెమ్యూనరేషన్ మాట్లాడుకొని అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్తే మంచిదని భావిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో కూడా మన స్టార్ హీరోలు సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మంత్రం ముగ్ధుల్ని చేస్తారా?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా హవా ని ముందుకు తీసుకెళ్తారా? అలాగే మన సినిమా ఇండస్ట్రీ ని ఎవరు టచ్ చేయలేని స్థాయికి తీసుకెళ్లగలుగుతారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున ‘కింగ్ 100’ అంటూ తన వందో మూవీనైతే చేస్తున్నాడు.
ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తానని తను చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి ఏ రేంజ్ సక్సెస్ ని కట్టబడుతుంది. ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…