Women’s Day 2025: రంగం ఏదైనా తాము సైతం అంటున్నారు మహిళలు. ప్రతిచోటా పురుషులకు సవాల్ విసురుతూ ధీటుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు తమ కుటుంబంలోని మహిళలను సినిమా పరిశ్రమకు తేవడానికి ఇష్టపడేవారు కాదు. ప్రస్తుతం పలువురు స్టార్ కిడ్స్ నిర్మాతలుగా, కొందరు నటులు, హీరోయిన్స్ గా కూడా చేస్తున్నారు.
Also Read: ‘ఓజీ’ కి డేట్స్ కేటాయించిన పవన్ కళ్యాణ్..విడుదల తేదీ కూడా ఫిక్స్..ఫ్యాన్స్ కి ఇక పండగే!
బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ఆమె నిర్మించనున్నారు. ఇక చిరంజీవి చిన్న కుమార్తె సుస్మిత ఇప్పటికే పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె సినిమాలు నిర్మిస్తున్నారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీకి సుస్మిత ప్రొడ్యూసర్ కావడం విశేషం. నాగబాబు కుమార్తె నిహారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాల్లో నిహారిక హీరోయిన్ గా చేసింది. ఒకటి రెండు తమిళ చిత్రాల్లో సైతం నటించింది.
మరోవైపు నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది నిహారిక. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి స్మాల్ బడ్జెట్ చిత్రాల నిర్మాణం పై దృష్టి పెట్టింది. కమిటీ కుర్రోళ్ళు టైటిల్ తో ఆమె నిర్మించిన చిత్రం విజయం సాధించింది. లాభాలు తెచ్చిపెట్టింది. హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వీరిద్దరూ నిర్మాతలుగా కూడా వ్యవహరించారు.
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె యాక్టర్, టెలివిజన్ హోస్ట్, ప్రొడ్యూసర్ కూడాను. మంచు లక్ష్మి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. మహేష్ బాబు సిస్టర్ మంజుల ఘట్టమనేని యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ఆమె నిర్మించారు. షో అనే ప్రయోగాత్మక చిత్రంలో మంజుల హీరోయిన్ గా చేసింది. క్యారెక్టర్ రోల్స్ లో సైతం మెప్పించారు. ప్రభాస్ సిస్టర్ ప్రసీద ఉప్పలపాటి తండ్రి నెలకొల్పిన గోపికృష్ణ ప్రొడక్షన్స్ లో చిత్రాలు నిర్మిస్తుంది.
అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఇద్దరు కుమార్తెలు చిత్ర నిర్మాణంలో రాణిస్తున్నారు. ప్రియాంక దత్, స్వప్న దత్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది.