Nidhi Agarwal: స్టార్ సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్ లోకి రావాలంటే భయపడిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ పరిస్థితి ఈమధ్య కాలం లో దారుణం గా తయారైంది. జనం మధ్యలో నుండి నడిచి వెళ్తే వాళ్ళ ప్రాణాలు పొయ్యినంత పని అవుతోంది. నిన్న సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం లో నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి నిన్న ‘సహానా సహానా’ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అందుకోసం హైదరాబాద్ లోని ఒక మాల్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి నిధి అగర్వాల్ అతిథి గా పాల్గొన్నది. ఆమె చూడడం కోసం అభిమానులు వేలాదిగా తరళి వచ్చారు. ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయం లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
అభిమానులు ఒక్కసారిగా ఆమెని కలవడం కోసం ముందుకు వెళ్లారు, దీంతో తోపులాట జరిగింది, వాళ్ళ మధ్యలో నిధి అగర్వాల్ పాపం నలిగిపోయింది. ఆమెకు ఊపిరి ఆడనంత పని అయ్యింది. చివరికి ఆమె వ్యక్తిగత సిబ్బంది అతి కష్టం మీద అభిమానుల నుండి ఆమెని కాపాడి కారులోకి ఎక్కించారు. కారు ఎక్కిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉన్నిందో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో. నిధి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. అభిమానులతో చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటుంది. ముట్టుకుంటూనే ఒప్పుకోని హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో, నిధి అగర్వాల్ తన అభిమానులకు ఎన్నో సందర్భాల్లో హగ్గులు కూడా ఇచ్చింది. ఇలా అందరితో స్నేహపూర్వకంగా ఉండే ఓకే స్టార్ సెలబ్రిటీ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు అవ్వడం నిజంగా దురదృష్టకరం. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.
ఇక ‘రాజా సాబ్’ చిత్రం విషయానికి వస్తే వచ్చే నెల 9 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 8 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ స్వయంగా నిన్న మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. సినిమాకు సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. సెన్సార్ కాపీ కూడా సిద్ధమైంది. సుమారుగా ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుందట. ఫైనల్ కట్ లో 3 గంటలకు కుదించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 27 న హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Scary visuals of #NidhhiAgerwal being mobbed by fans at the #TheRajaSaab song launch.
A little common sense from the crowd would have made the situation better. pic.twitter.com/2kAv43zJ2Q
— Gulte (@GulteOfficial) December 17, 2025