Nidhi Agarwal: నిన్న హైదరాబాద్ లోని లుల్లూ మాల్ లో ‘రాజా సాబ్'(The Rajasaab Movie) లోని ‘సహానా..సహానా’ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఎంత అట్టహాసంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఈవెంట్ కి నిధి అగర్వాల్(Nidhi Agarwal) అతిథిగా విచ్చేసింది. ఈమెని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా లుల్లూ మాల్ లో పోటెత్తారు. ఈవెంట్ ని ముగించుకొని బయటకు వస్తున్న సమయం లో అభిమానులు నిధి అగర్వాల్ ని తొక్కేసేంత పని అయ్యింది. ఆమె ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయాయి. దీంతో సిబ్బంది ఆమెని రక్షిస్తూ, అతి కష్టం మీద అభిమానులను తప్పించి కారులో ఎక్కించాల్సి వచ్చింది. కారు లోకి ఎక్కినా తర్వాత పాపం నిధి అగర్వాల్ ఏడ్చినంత పని అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. చిన్మయి వంటి వారు కూడా అభిమానుల ప్రవర్తనపై మండిపడ్డారు.
అయితే ఇక్కడ అభిమానుల తప్పేమి లేదు, ఒక స్టార్ సెలబ్రిటీ అలా నడిచి వెళ్తుంటే ఆమెని కలుసుకోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అందులో భాగాంగానే నిన్న ఆ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల బాధ్యత వహించాల్సింది ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన ఈవెంట్ నిర్వాహకులదే. ఈ వీడియోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవ్వడం తో KPHB పోలీసులు సుమోటోగా కేస్ నమోదు చేశారు. మాల్ మరియు ఈవెంట్ నిర్వాహకులు మా నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, SHO రాజశేఖర్ రెడ్డి మీడియా తో తెలిపారు. ఎలాంటి దుర్ఘటన జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ హీరోయిన్ నిధి అగర్వాల్ కి కానీ, లేదా అక్కడికి వచ్చిన అభిమానులకు కానీ, తొక్కిసలాట కారణంగా జరగరానివి జరిగి ఉండుంటే పరిస్థితి ఏంటి అంటూ ఈవెంట్ నిర్వాహకులను నిలదీశారు పోలీసులు. అయితే ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో, ప్రభాస్ అభిమానులపై పోలీస్ కేస్ నమోదు అయ్యినట్టు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు, కేవలం ఈవెంట్ నిర్వహులపైనే కేస్ నమోదు చేసారు.