Kavya Maran: మీ క్రియేటివిటీ తగలెయ్య.. మీ ఆలోచనకు పిండంపెట్ట.. ఇదేంట్రా ఇలా చేశారు.. ఇలా చేసి ఏం చేద్దాం అనుకున్నార్రా.. అసలు మీ బుర్రె బుర్ర.. పాదరసం కంటే ఎక్కువ పని చేస్తోంది కదరా..
ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది ఇదే విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే రాయడానికి వీలు లేని భాషలో కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే ఈ కామెంట్లు చేరాల్సిన వాళ్ల దాకా చేరుతున్నాయా.. ఒకవేళ చేరితే వాళ్ల రిప్లై ఏంటి.. అనే కోణంలో కూడా చర్చ నడుస్తోంది.
ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ కు ఒక క్రికెటర్ కు ఏ స్థాయిలో ఉంటుందో.. ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కావ్య నవ్వితే చాలు.. సోషల్ మీడియా ఊగిపోతుంది. కావ్య ఎగిరి గంతేస్తే చాలు సోషల్ మీడియాలో ఉప్పెన రేగుతుంది. కావ్య చిన్న నవ్వు నవ్వి ఫోటోను సోషల్ మీడియాలో పెడితే మంట అంటుకుంటుంది. ఇది కావ్య రేంజ్.. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో బోనాల వేడుక ఆకాశాన్ని తాకుతోంది. బోనాల సందర్భంగా అమ్మవారికి నైవేద్యం పెట్టడం.. బోనం సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే ఈసారి హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య నెత్తి మీద బోనం పెట్టుకొని అమ్మవారికి సమర్పించింది. ఆమె పక్కనే పోతురాజులు మాదిరిగా ఇషాన్ కిషన్.. క్లాసెన్ ఉన్నారు. ఇదేంటి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ. కొందరు టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనిని సన్రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో కావ్య గురించి చర్చ మొదలైంది. హైదరాబాద్ అభిమానులు నెత్తిమీద బోనంతో కావ్య నడిచి వస్తుంటే అచ్చం దేవతలాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఫోటోలో చూస్తేనే ఇంత బాగుంటే.. నిజంగానే కావ్య పాప నెత్తి మీద బోనం పెట్టుకొని ఎత్తుకొని వస్తుంటే ఇంకెంత బాగుంటుందోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కావ్య ఇలా బోనం ఎత్తుకొని రావడం వల్ల అచ్చం సగటు తెలంగాణ ఆడపడుచు లాగా ఉందని.. అందానికి ఆధార్ కార్డు లాగా కనిపిస్తోందని కొంతమంది కొంటెకురాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేసి.. కావ్య మీద తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.