Richest Heroine: అతి తక్కువ సమయంలో వాళ్లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డంను ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంటారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిందే. ఈ అమ్మడు కేవలం 16 ఏళ్ల చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. కెరియర్ ప్రారంభంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ రూ.4600 కోట్ల ఆస్తితో భారత దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణించిన టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేది. ఒక్కో సినిమాకు భారీగా పారితోషం కూడా అందుకునేది. అప్పట్లో ఆమెకు ఫుల్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. అతి తక్కువ సమయంలోనే ఈ భామ సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఈ బ్యూటీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చెప్పడంతో ఆమె తండ్రి నిరాకరించారు. అప్పట్లో కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని ఏలిన ఆమె ప్రస్తుతం వ్యాపార రంగంలో తన సత్తా చాటుతుంది. రూ. 4600 కోట్ల ఆస్తితో భారత దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్గా నిలిచింది. ఈమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా.
అప్పట్లో ఈమెకు శ్రీదేవి రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో ఈమె కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటించింది. అక్కినేని నాగార్జున తో కలిసి విక్కీ దాదా అనే సినిమాలో నటించిన జుహీ చావ్లా. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. 1984లో జుహీ చావ్లా మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. 1986లో ధర్మేంద్ర, సన్నీడియోల్, శ్రీదేవి నటించిన సుల్తానత్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో తెలుగు, హిందీ, మలయాళం భాషలలో నటించే అవకాశం అందుకుంది.
అయితే హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత జుహీ చావ్లా సహాయ పాత్రలలో కూడా నటించడం మొదలుపెట్టింది. హిందీలో ఈమె అనేక సినిమాలలో నటించింది. పెళ్లి తర్వాత జుహీ చావ్లా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో తన టాలెంట్ చూపిస్తుంది. నివేదిక ప్రకారం ఈ ప్రస్తుతం జూహి చావ్లా ఆస్తుల విలువ రూ. 4600 కోట్లుగా సమాచారం. సినిమా ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.
View this post on Instagram