Homeఆంధ్రప్రదేశ్‌Undavalli Arun Kumar: వైసిపి, జగన్ భవితవ్యాన్ని తేల్చేసిన ఉండవల్లి!

Undavalli Arun Kumar: వైసిపి, జగన్ భవితవ్యాన్ని తేల్చేసిన ఉండవల్లి!

Undavalli Arun Kumar: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. ఎప్పటికప్పుడు సమకాలిన రాజకీయ అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు ఉండవెల్లి. తరచూ రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాల కోసం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం వైయస్సార్ […]

Undavalli Arun Kumar: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. ఎప్పటికప్పుడు సమకాలిన రాజకీయ అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు ఉండవెల్లి. తరచూ రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాల కోసం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆందోళనలో పెడుతున్నాయి. జగన్ తప్పిదాలను, వైసిపి వైఫల్యాలను నేరుగా బయటపెట్టేశారు ఉండవల్లి. దీంతో వైసిపి శ్రేణులు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నాయి.

* రాజకీయ విశ్లేషకుడిగా మారి..
ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కంటే విశ్లేషకుడిగా పేరు ఉంది. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి రహస్య సలహాదారుడుగా ఉన్నారు అనేది ప్రత్యర్థులు చేసే విమర్శ. ఎందుకంటే ఆయన చేసే విశ్లేషణలో జగన్మోహన్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆయనపై ఉన్న ఫేవర్ వినిపిస్తుంది. 2014 నుంచి 2019 మధ్య ఇలానే విశ్లేషణలు చేసేవారు. కానీ అప్పట్లో చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఏకంగా మద్యం బాటిల్లను తెచ్చి మరి విశ్లేషించిన పరిస్థితి ఉండేది. కానీ 2019 నుంచి 2024 మధ్య ఒకటి రెండు సందర్భాల్లో తప్ప నేరుగా జగన్ పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు.

* వైసీపీలో చేరుతారని..
2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేసరికి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఖరిలో సైతం మార్పు వచ్చింది. ఎంతైనా తన స్నేహితుడి కుమారుడు కావడంతో ఆయనపై ఉన్న అభిమానాన్ని తగ్గించుకోలేకపోయేవారు. ఒకానొక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారని కూడా ప్రచారం నడిచింది. మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసి అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. కానీ అటువైపు చూడలేదు ఉండవల్లి. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటివారు విషయంలో మాత్రం స్పందించారు. వారి అరెస్టు తప్పు అన్నట్టు మాట్లాడారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని తెలిసిపోయిందని మాత్రం ఇంటర్వ్యూలో గట్టిగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తనదైన విశ్లేషణల రూపంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ జగన్ అధికారంలోకి రావడం జరగని పని అంటూ తేల్చేశారు. అందుకు రకరకాల కారణాలను చెబుతున్నారు.

* అమరావతి, మావిగన్ తో పతనం..
ఓ టీవీ ఇంటర్వ్యూలో జగన్ వైఖరిని తప్పుపట్టారు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్. అమరావతి ఏకైక రాజధాని అంటూ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే.. దానిని వ్యతిరేకించి తప్పిదాలకు పాల్పడ్డారు అన్నారు. మావిగన్ అనే పిచ్చి ప్రతిపాదన తీసుకొచ్చి అందరికీ వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఒక్క పాయింట్ చాలు ఆయన అధికారంలోకి రారు అని తేల్చి చెప్పారు. పైగా మూడు పార్టీల కూటమి గానే ఉంటాయి అని తేలిపోయిందని.. ఇక అధికారం కల్ల అంటూ ఉండవల్లి తేల్చి చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు నీరు గారి పోతున్నాయి. పోనీ ఇన్నాళ్లకు ఉండవల్లి కరెక్ట్ మాట చెప్పారు అంటూ కూటమి పార్టీల శ్రేణులు సైతం ఆయనను అభినందిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper