HomeతెలంగాణMurthy: సర్ ప్రైజ్.. గ్రేట్ ఆంధ్రా నుంచి ఎగ్జిట్ అయ్యాక మూర్తి ఎందులో చేరాడో తెలుసా..

Murthy: సర్ ప్రైజ్.. గ్రేట్ ఆంధ్రా నుంచి ఎగ్జిట్ అయ్యాక మూర్తి ఎందులో చేరాడో తెలుసా..

Murthy: ఇప్పుడంటే ప్రతి ఒక్కడు సినిమా జర్నలిస్ట్ అయిపోతున్నాడు. లాబీయింగ్ చేసుకొని పిఆర్ఓ అవుతున్నాడు. ఇక పిఆర్ఓ తెలుగు సినిమాలో పెద్ద దందా. వీళ్లు సినిమాకు ప్రమోషన్ చేయరు.. జస్ట్ నిర్మాత దగ్గర నుంచి డబ్బులు తీసుకొని.. హంగామా చేసి వెళ్లిపోతారు. తెలుగు సినీ జర్నలిజంలో కొంతమంది సీనియర్ వ్యక్తులు ఉన్నారు. ఒకరకంగా తెలుగు సినిమా జర్నలిజం పుట్టిందే వీరి వల్ల. అటువంటి వారిలో ముఖ్యులు మూర్తి.. ఈయన సీనియర్ సినిమా జర్నలిస్ట్. సినిమా బాగుంటే బాగుందని […]

Murthy: ఇప్పుడంటే ప్రతి ఒక్కడు సినిమా జర్నలిస్ట్ అయిపోతున్నాడు. లాబీయింగ్ చేసుకొని పిఆర్ఓ అవుతున్నాడు. ఇక పిఆర్ఓ తెలుగు సినిమాలో పెద్ద దందా. వీళ్లు సినిమాకు ప్రమోషన్ చేయరు.. జస్ట్ నిర్మాత దగ్గర నుంచి డబ్బులు తీసుకొని.. హంగామా చేసి వెళ్లిపోతారు.

తెలుగు సినీ జర్నలిజంలో కొంతమంది సీనియర్ వ్యక్తులు ఉన్నారు. ఒకరకంగా తెలుగు సినిమా జర్నలిజం పుట్టిందే వీరి వల్ల. అటువంటి వారిలో ముఖ్యులు మూర్తి.. ఈయన సీనియర్ సినిమా జర్నలిస్ట్. సినిమా బాగుంటే బాగుందని చెప్తారు. బాగోలేకపోతే మొహమాటం లేకుండా బాగోలేదని అంటారు. పైగా వాక్యంలో సినిమా భవితవ్యాన్ని చెప్పగలిగే సామర్థ్యం ఈయన సొంతం. పైగా లోతైన విశ్లేషణ చేయడం.. ఒక సినిమా నిర్మాణంలో అంతర్గత విషయాలను బయట పెట్టడం ఈయనకు మాత్రమే సొంతం

గతంలో ఈయన చేసిన విశ్లేషణ.. మాట్లాడిన మాటలు అన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. కొద్దిరోజులు ఈయనను సినిమా ఈవెంట్లకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఒక రకంగా బ్యాన్ విధించారు. పైగా గతంలో ఈయన గ్రేట్ ఆంధ్ర అనే ఓ వెబ్సైట్లో పని చేసేవారు. ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇబ్బందికరంగా ఉండడంతో గ్రేట్ఆంధ్ర నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎందులో చేరుతారు.. అనేది ఆసక్తికరంగా ఉండేది. కొద్దిరోజుల పాటు ఆయన ఎందులో చేరకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. చివరికి మూర్తి ఒక ట్విస్ట్ ఇచ్చారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానల్.. వెబ్సైట్ ఐ డ్రీమ్ లో మూర్తి చేరారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల సీనియర్ నిర్మాత .. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తో పాడ్ కాస్ట్ నిర్వహించారు. మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి తీసిన సినిమాలు.. వాటి వల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు.. పొందిన లాభాల గురించి ఈ పాడ్ కాస్ట్ సాగింది. లోతైన ప్రశ్నలు వేసి అదే స్థాయిలో సమాధానాలు రాబట్టగలిగే సామర్థ్యం మూర్తికి ఉంటుంది. తాజా పాడ్ కాస్ట్ లో తమ్మారెడ్డి భరద్వాజను అదే స్థాయిలో ప్రశ్నలు అడిగి.. సమాధానం రాబట్టారు. ఇప్పటివరకు మూర్తి ఎందులో చేరబోతారు అనే ప్రశ్న వినిపించేది. ఐ డ్రీం లో చేరడం ద్వారా మూర్తి మొత్తానికి క్లారిటీ ఇచ్చేశారు. ఐ డ్రీంలోనైనా మూర్తి కుదురుగా ఉంటారా.. తనకు నచ్చినట్టుగానే కామెంట్లు చేస్తారా..చూడాల్సిఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper