Allu Arjun Friends: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో అల్లు అర్జున్ ఒకరు…పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు… అట్లీ డైరెక్షన్లో చేస్తున్న రాకా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయనకి తిరుగుండదనే చెప్పాలి. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… ఇక ఇదిలా ఉంటే తను చేయబోయే AA23 మూవీ లో తన ఫ్రెండ్స్ అయిన బన్నీ వాసు, సందీప్ రామ్ రెడ్డి, నటరాజ్ స్వాతి అనే నలుగురు పేర్లను కూడా కో ప్రొడ్యూసర్స్ గా ఆడ్ చేశాడు. ప్రస్తుతం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ న్యూస్సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
వీళ్ళందరు అల్లు అర్జున్ కి హీరో అవ్వక ముందు నుంచే పరిచయం ఉండడంతో తన స్నేహితులను ఎలాగైనా సరే తను చేసే సినిమాలో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో తను చేస్తున్న ప్రతి సినిమా విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. వీలైతే ప్రొడ్యూసర్లుగా లేకపోతే కో ప్రొడ్యూసర్స్ లాగా అయినా వారిని జత చేస్తూ ఉంటాడు.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు అంటు కొన్ని వార్తలు వినిపిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం తన ఫ్రెండ్స్ గురించి ఇప్పటికి ఆలోచిస్తాడు. వాళ్ళను తను చేసే బిజినెస్ లలో కూడా భాగం చేస్తూ ఉంటారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో చేస్తున్న ప్రతి సినిమా విషయంలో బన్నీ వాసు ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి.
ముందుగా బన్నీ వాసు కథను విని ఆ తర్వాత అల్లు అర్జున్ కి ఆ స్టోరీ ని రిఫర్ చేస్తాడు అంటూ చాలా వార్తలు గతం నుంచే వచ్చేవి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంకా బాండింగ్ పెరిగింది. దాంతో అసలైన ఫ్రెండ్స్ అంటే వీళ్ళే అంటూ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీళ్లను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ అభిమానులు సైతం చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…