Homeఆంధ్రప్రదేశ్‌Managing Editor Controversy: చిట్టా రెడీ అయింది.. మేనేజింగ్ ఎడిటర్ పోస్ట్ ఊస్టేనా..

Managing Editor Controversy: చిట్టా రెడీ అయింది.. మేనేజింగ్ ఎడిటర్ పోస్ట్ ఊస్టేనా..

Managing Editor Controversy: ఓ 25 ఏళ్ల క్రితం ఆయన ఒక సాధారణ జర్నలిస్ట్. హైదరాబాద్ మధుర నగర్ లో రెంట్ హౌస్ లో ఉండేవారు. పిల్లల్ని ఒక సాధారణ ప్రవేట్ స్కూల్లో చదివించేవారు. ఆఫీసుకు బజాజ్ కంపెనీ బైక్ మీద వచ్చేవారు. మొదట్లో తాను చేస్తున్న సంస్థ అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత తన స్థాయిని పెంచుకున్నారు. పలుకుబడిని పెంచుకున్నారు. దాంతోపాటు రాబడి పెరిగిపోయింది. నాలుగు రాళ్లు కాదు 16 రాళ్లు […]

Managing Editor Controversy: ఓ 25 ఏళ్ల క్రితం ఆయన ఒక సాధారణ జర్నలిస్ట్. హైదరాబాద్ మధుర నగర్ లో రెంట్ హౌస్ లో ఉండేవారు. పిల్లల్ని ఒక సాధారణ ప్రవేట్ స్కూల్లో చదివించేవారు. ఆఫీసుకు బజాజ్ కంపెనీ బైక్ మీద వచ్చేవారు.

మొదట్లో తాను చేస్తున్న సంస్థ అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత తన స్థాయిని పెంచుకున్నారు. పలుకుబడిని పెంచుకున్నారు. దాంతోపాటు రాబడి పెరిగిపోయింది. నాలుగు రాళ్లు కాదు 16 రాళ్లు వెనకేశారు. ఆ తర్వాత ఆ చానల్లో నాయకత్వం మారింది. తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఈయనకు మేనేజింగ్ ఎడిటర్ పోస్ట్ వచ్చింది.

ఎప్పుడైతే ఈయనకు ఆ పోస్ట్ వచ్చిందో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈయనకు అనుకూలంగా ఉండేవి ఏర్పడ్డాయి. ఇంకేముంది సారు జోరు చూపించారు. తెలంగాణ కాకుండా తన సొంత రాష్ట్రంలో దుమ్ము రేపడం ప్రారంభించారు. బినామీ వ్యాపారాలు.. పబ్బులు.. క్లబ్బులు.. గట్టిగానే వందల కోట్ల వరకు వేశారు. హైదరాబాదులో అత్యంత ఖరీదైన భవంతులు.. ఆంధ్రాలో చేపలచెరువులు.. ఇంకా రకరకాల వ్యవహారాలలో సారు ఫుల్లు బిజీ.

ఇతరుల గురించి.. గట్టిగా గొంతు వేసుకొని అరిచే ఈయన.. తన నలుపు వ్యవహారం బయటికి రావడంతోనే సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా తాను నిప్పు.. చేయలేదు తప్పు అన్నట్టుగా పోస్ట్లు పెట్టారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతో సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం చేయించారు. ఆయనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి ఈ మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ వ్యవహారాలు.. అడ్డగోలు బాగోతాలు బయటపడ్డాయి. ఇటీవల ఆయన వేరే దేశం వెళ్లారు. అక్కడినుంచి ఏదో గొప్పగా సాధించినట్టు బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టారు. మళ్లీ ఇండియాకు వచ్చారు. కాకపోతే ఈసారి ఎటువంటి ఇంటర్వ్యూలు ఆయన చేయలేదు. కార్యాలయానికి మాత్రం వస్తున్నారు.

ఈ క్రమంలో ఆ మేనేజింగ్ ఎడిటర్ చిట్టా మొత్తం మేనేజ్మెంట్ సేకరించిందని.. విదేశాల నుంచి రాగానే ఆయన ముందు పెట్టిందని.. కమాన్ ఆన్సర్ మీ అని క్వశ్చన్ చేసిందని.. ఇంతవరకు దానికి ఆయననుంచి ఎటువంటి రిప్లై రాలేదని తెలుస్తోంది. మొత్తానికి ఆయన పోస్ట్ ఊడి పోవడానికి రెడీగా ఉందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఆయన ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిల వ్యక్తుల నుంచి మేనేజ్మెంట్ కు ఫోన్ చేయిస్తున్నారని వినికిడి. అయితే మేనేజ్మెంట్ ఈయన ఒత్తిడికి తలవంచుతుందా.. ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకొని బయటికి పంపిస్తుందా.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper