Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సినీ కెరీర్ మొత్తం మీద తన సినిమాకు ప్రొమోషన్స్ చేసుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రమే ఆయన పాల్గొంటూ ఉంటాడు. అది కూడా అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేయడం వల్ల మాత్రమే. అలాంటి పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో ఏ రేంజ్ లో పాల్గొన్నాడో మనమంతా చూసాము. లోకల్ నుండి నేషనల్ మీడియా వరకు ఆయన ఇంటర్వూస్ ఎడాపెడా ఇచ్చేసాడు. నిర్మాత AM రత్నం అసలే కష్టాల్లో ఉన్నాడు కదా, పైగా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు కాబట్టి, ఆయన కోసం స్పెషల్ గా చేసి ఉండొచ్చు, మళ్లీ పవన్ కళ్యాణ్ ని ఇలా చూడలేం అని అంతా అనుకున్నారు. కానీ ఓజీ(They Call Him OG) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అడుగు ముందుకేసి ఆయన ఓజీ గెటప్ లో దర్శనం ఇవ్వడం అభిమానులకు ఒక షాకింగ్ సర్ప్రైజ్ లాగా నిల్చింది.
ఆరోజు భారీ వర్షం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మధ్యలోనే ముగించేసి వెళ్లిపోవాల్సి వచ్చింది కానీ, సినిమా విడుదలై సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవడం నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ ని హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ ఈవెంట్ లో ఆయన హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ని గుర్తు చేసుకోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. నా గత చిత్రం హరి హర వీరమల్లు ప్రొమోషన్స్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ గారు చాలా యాక్టీవ్ గా పాల్గొనే వారని, ఆమె కష్టం నన్ను కదిలించిందని, అందుకే బాధ్యత తీసుకొని నేను కూడా ప్రొమోషన్స్ లో పాల్గొన్నానని చెప్పుకొచ్చాడు.
ఇది చూసిన తర్వాత పవన్ అభిమానులు మా అన్నలో ఇంతటి మార్పు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేశారు. ఇక ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో, ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ స్పందిస్తూ ‘ఓ మై గాడ్..కళ్యాణ్ సార్..థాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ జానీ గన్ ని పట్టుకొని ఫోటోలకు సుజిత్, థమన్ తో కలిసి ఫోజులు ఇవ్వడం కూడా బాగా హైలైట్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా సూపర్ హిట్ తో అభిమానులకు బోలెడన్ని జ్ఞాపకాలు అందించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సక్సెస్ మీట్ తో కూడా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.