OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సుజిత్(Director Sujeeth) దర్శకత్వం లో ఏడాది క్రితం మొదలైన ఈ సినిమా 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి 21 రోజుల షూటింగ్ ని పూర్తి చేస్తే,ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఫుల్ బిజీ అవ్వడంతో ఇన్ని రోజులు డేట్స్ కేటాయించలేకపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అవుతుండడంతో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ’ రెండు చిత్రాలను పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ‘హరి హర వీరమల్లు’ సినిమాకి కేవలం నాలుగు రోజుల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుంది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Also Read : పవన్ కళ్యాణ్ OG సినిమా పోస్టర్ ని చూపించి భారీ స్కామ్.. రూ.1.34 కోట్లు కొట్టేశారు!
ఇక ‘ఓజీ’ చిత్రం విషయానికి వస్తే, ఈ నెలాఖరు నుండి, లేదా వచ్చే నెల మొదటి వారం నుండి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వచ్చే నెలలోనే విడుదల తేదీని కూడా లాక్ చేసి, గ్రాండ్ గా ప్రకటన చేయబోతున్నారట. సెప్టెంబర్ 25 లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ చిత్రానికి క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది కాబట్టి, సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు విడుదల చేసినా ప్రభంజనం సృటించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 230 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట.
ఆడియో, సాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఇలా అన్ని కలిపి ఈ సినిమాకి 450 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే 160 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట. కేవలం ఒక్క గ్లిమ్స్ వీడియో కారణం క్రియేట్ అయిన హైప్ ఇది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఖరారు చేస్తే, ఈ ఉగాదికే విడుదల తేదికి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యూట్యూబ్ లో కేవలం హిందీ వెర్షన్ కి 53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండా, ఇంత ఆర్గానిక్ గా ఒక హిందీ డబ్బింగ్ సినిమాకి వ్యూస్ రావడం ఇదే తొలిసారి. చూడాలి మరి అక్కడ పవన్ మ్యాజిక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది.
Also Read : ఒక డిప్యూటీ సీఎం గ్యాంగ్ స్టర్ అంటే జనాలు అంగీకరిస్తారా..? ‘ఓజీ’ చిత్రంపై అభిమానులు టెన్షన్!