Kiran Abbavaram : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత ‘క’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ ‘దిల్ రూబా'(Dilruba Movie) తో మరోసారి భారీ హిట్ కొట్టి, తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు, కానీ రెస్పాన్స్ ఊహించిన రేంజ్ లో అయితే రాలేదు. లైన్ కొత్తగానే ఉంది కానీ, స్క్రీన్ ప్లే మాత్రం పాత చింతకాయ పచ్చడి లాగానే అనిపించింది. అందుకే సినిమాకి రావాల్సిన హైప్ రావడం లేదు.
Also Read : మాజీ ప్రియుడికి పెళ్లి చేసే ప్రేయసి.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ మూవీ స్టోరీ!
అయితే తన ప్రతీ సినిమాకి ప్రొమోషన్స్ విషయం లో కిరణ్ అబ్బవరం ప్రాణం పెట్టేస్తాడు. తన సినిమాని ఆడియన్స్ కి చేరువ చేసేలా ఎన్ని మార్గాలు ఉంటాయో, అన్ని మార్గాలను ప్రయత్నం చేస్తుంటాడు. అలా ‘దిల్ రూబా’ చిత్రానికి కూడా ప్రొమోషన్స్ దుమ్ము లేపేస్తున్నాడు. ఇంటర్వ్యూస్ భారీగా ఇస్తున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన వ్యక్తిగత విషయాలు, తన భవిష్యత్తు ప్రణాళికలు, ఇలా ఎన్నో అంశాల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను సినిమాల్లోకి రాకపొయ్యుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడిని. నేను సీమ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి, నాకు చిన్నప్పటి నుండి రాజకీయాలను దగ్గరగా చూడడం అలవాటు అయ్యింది. ఇప్పటికీ రాజకీయాలను నేను రెగ్యులర్ గా అనుసరిస్తూనే ఉంటాను. జనాలతో కలిసిపోయి, వాళ్ళతో మమేకమై మాట్లాడి తిరుగుతూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఓపిక లేదు కానీ, ఒక ఫుడ్ బిజినెస్ ని పెట్టాలని ఆసక్తి ఉంది. మా సీమ రుచులను జనాలకు అందించేలా చేయడమే నా లక్ష్యం. దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.
Also Read : బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!