Suriya తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్యకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం అతనికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన మార్కెట్ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఆయన వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ఆగస్టు 14 వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో తనకంటూ ఒక గొప్ప క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో సూర్య ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సూర్య ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇందులో తన కొడుకు వల్ల అతను ఒక కేసులో ఇరుక్కుంటాడు. దానివల్ల తను జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని చాలా లైట్ వెయిట్ తో తీసినట్టుగా తెలుస్తుంది.
పెద్దగా ట్విస్టు లు టర్న్ లు లేకుండా సినిమాని చాలా సాఫ్ట్ కార్నర్ తో తెరకెక్కించారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని తీసుకొస్తుంది. వెంకీ అట్లూరి గతంలో చేసిన సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల రిజల్ట్ ను పునరావృతం చేస్తూ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక మొత్తానికైతే సూర్య ఈ సంవత్సరం ఇప్పటికే ‘వీరభద్రుడు’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆ సక్సెస్ పరంపరను కొనసాగిస్తూ ఈ సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటే మాత్రం అతనికి తిరుగుండదనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ ని తీసుకొస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…