Venky Atluri Movies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు కొంత మంది దర్శకులు చాలా తక్కువ సినిమాలతో తెచ్చుకుంటున్నారు. ఇక ఇలాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా కెరియర్ స్టార్టింగ్ లో ‘తొలిప్రేమ’ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక అప్పటినుంచి తన పంథాను మార్చుకొని సార్, లక్కీ భాస్కర్, విశ్వనాధ్ అండ్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన రాసుకున్న ప్రతి స్టోరీని ఒక తెలుగు హీరోకి వ్యతిరేకంగా నిపించాడట. ఆ కథలను విన్న ఆ స్టార్ హీరో వాటిలో ఏ సినిమా చేయలేదు.
కారణం ఏదైనా కూడా ఆయన కి ఆ కథలు సెటవ్వావు అని భావించారట. ఇంతకీ వెంకీ అట్లూరి తన కథలన్నింటిని చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరు అంటే నాగచైతన్య కావడం విశేషం… వెంకీ అట్లూరి, నాగచైతన్య ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండడంతో తను రాసుకున్న కథలను నాగచైతన్యకు వినిపించేవారట.
ఏదేమైనా కూడా కథ నచ్చితే మనం చేద్దామని చెప్పినప్పటికి నాగ చైతన్య మాత్రం వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. మొత్తానికైతే వరుసగా మూడు విజయాలు ఇతర భాషల హీరోలకు కట్టబెట్టిన వెంకీ అట్లూరిని తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత బాగా అర్థం చేసుకోలేదని చాలామంది చాలా రకాల విమర్శలైతే చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఆయన ఎవరితో సినిమాలు చేస్తాడనేది తెలియాల్సి ఉంది… ఇక నాగచైతన్య విషయం తెలిసిన తర్వాత అక్కినేని అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు సైతం ఎందుకని నాగ చైతన్య ఈ కథలను రిజెక్ట్ చేశాడు అంటు అతని మీద కొంతవరకు విమర్శలైతే చేస్తున్నారు…