Scene Movie: ఈ ఏడాది సూర్య కి అదృష్టం మామూలు రేంజ్ కలిసి రాలేదు. కరుప్పు, విశ్వనాధ్ & సన్స్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య, రీసెంట్ గా ‘సీన్’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నాడు. థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతున్న ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 4 న తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రాంతాల వారీగా సీన్ చిత్రం ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 91 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. 100 కోట్ల గ్రాస్ మార్కుని ఈ ప్రాంతం లో కచ్చితంగా అందుకుంటుందని అనుకున్నారు కానీ, టార్గెట్ మిస్ అయ్యింది. క్లోజింగ్ లో ఈ చిత్రం మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక నుండి 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కేరళ నుండి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.