Venky Atluri: వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య హీరోగా తెరకెక్కిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడం అనేది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి వెంకీ అట్లూరి రంగ్ దే మూవీ ప్లాప్ అయిన తర్వాత అతనికి ఏ హీరో కూడా పెద్దగా అవకాశాలను ఇవ్వలేదు. అయినప్పటికి ధనుష్ తో ‘సార్’ అనే ఒక డిఫరెంట్ సినిమాను చేసి సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో ప్రతి ఒక్కరు అతని వైపు చూస్తున్నారు…
రీసెంట్ గా వెంకీ అట్లూరి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కొడుకు విదేశాల్లో గొప్ప స్థాయిలో ఉంటాడు. ఆ సన్నివేశాన్ని చాలా ఎమోషనల్ గా రాశారు. అలాగే సినిమాలో చాలా బాగా డీల్ చేశారు అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని రిపోర్టర్ అఅడిగాడు.
దానికి వెంకీ సమాధానం చెబుతూ దిల్ రాజు ఆఫీస్ లో నేను ఉన్నప్పుడు దిల్ రాజు గారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి తన కొడుకు విదేశాలకు వెళ్లాలి అంటే అప్పటికప్పుడు ఆయన వాళ్లకి హెల్ప్ చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆ సన్నివేశాన్ని రాశాను అంటూ వెంకీ అట్లూరి చెప్పాడు.
మొత్తానికైతే దిల్ రాజు ఇన్స్పిరేషన్ తో ఈ సీన్ రాసుకున్నట్టుగా తను చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి ఇప్పుడు పెను ప్రభంజనాలను క్రియేట్ చేసే దర్శకుడిగా మారిపోయాడు. స్టార్ హీరోలందరు అతని డైరెక్షన్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…