Aliaas Rukmini: నేచురల్ స్టార్ నాని ఒక పక్క సినిమాల్లో హీరోగా నటిస్తూ, మరోపక్క నిర్మాతగా కూడా అద్భుతమైన సినిమాలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గానే ఆయన నితిన్ ని హీరో గా పెట్టి ‘అలియాస్ రుక్మిణి’ అనే చిత్రాన్ని నిర్మించాడు. వచ్చే నెల 4న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ‘అలియాస్ రుక్మిణి’ చిత్రాన్ని మీరు థియేటర్ లో చూసి బయటకు వస్తున్న సమయం లో ఒక గొప్ప సినిమాని చూసాము అనే అనుభూతి మీకు కలగకపోతే, నేను చేయడం మానేస్తా, నాతో పాటు సుమ గారు యాంకరింగ్ చేయడం కూడా మానేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.
నాని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే కచ్చితంగా సినిమాలో ఎదో గొప్ప విషయం ఉందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే గతంలో కూడా నాని ‘కోర్టు‘ విషయం లో ఇదే తరహా కామెంట్ చేసాడు. ఆ సినిమా సమయం లో ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ, హీరో గా నటించిన ‘హిట్ : ది థర్డ్ కేసు‘ చిత్రం కూడా విడుదలకు దగ్గర్లో ఉంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ‘కోర్టు సినిమా మీకు నచ్చకపోతే, నేను నటించిన ‘హిట్ : ది థర్డ్ కేసు‘ చిత్రాన్ని చూడకండి. దీనికంటే దానికే ఎక్కువ ఖర్చు చేసాను, అయినప్పటికీ కూడా అలాంటి ఛాలెంజ్ చేసానంటే అర్థం చేసుకోండి, సినిమా ఎంత బాగా వచ్చిందో‘ అని చెప్పుకొచ్చాడు నాని. అతను చెప్పినట్టుగానే కోర్టు చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ గా అతి పెద్ద హిట్ గా నిల్చింది. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి‘ కి అంతకు మించిన సవాల్ చేసాడంటే, కచ్చితంగా ఈ సినిమాకు కూడా అదిరిపోయి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్.
మరో పక్క నితిన్ కి ఈ సినిమా సక్సెస్ అవ్వడం అత్యంత కీలకం. ఎందుకంటే భీష్మ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇష్క్ చిత్రానికి ముందు నితిన్ కి ఎలాంటి పరిస్థితి ఉండేదో, అలాంటి పరిస్థితి మరోసారి ఎదురైంది. కాబట్టి ఈ చిత్రం సక్సెస్ ఆయనకు చాలా ముఖ్యం. నితిన్ కూడా చాలా కాలం తర్వాత ఒక గొప్ప సినిమా చేశాను అనే ఫీలింగ్ తో ఉన్నాడు. తన కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా నిలుస్తుందని ధీమా తో ఉన్నాడు. మరి సినిమా ఆ రేంజ్ లో ఉందో లేదో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే. ఈ ఏడాది ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరూ భారీ కం బ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు నితిన్ కూడా కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.