HomeజాతీయంDelimitation 2026: డీలిమిటేషన్.. 2008లో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం...

Delimitation 2026: డీలిమిటేషన్.. 2008లో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎంత?

Delimitation 2026: డీలిమిటేషన్.. ఇది మనదేశంలో జరిగే చాలా కీలకమైన రాజకీయ.. రాజ్యాంగ ప్రక్రియ. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఇప్పుడు ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన చోటుచేసుకుంది. ఇప్పుడు 2026 లో జనాభా ఆధారిత పునర్విభజన జరుగుతుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది.. డీలిమిటేషన్ అంటే ఏమిటి ఒక రాష్ట్రంలో జనాభా పెరుగుదల చోటు చేసుకున్నప్పుడు.. […]

Delimitation 2026: డీలిమిటేషన్.. ఇది మనదేశంలో జరిగే చాలా కీలకమైన రాజకీయ.. రాజ్యాంగ ప్రక్రియ. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఇప్పుడు ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన చోటుచేసుకుంది. ఇప్పుడు 2026 లో జనాభా ఆధారిత పునర్విభజన జరుగుతుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది..

డీలిమిటేషన్ అంటే ఏమిటి

ఒక రాష్ట్రంలో జనాభా పెరుగుదల చోటు చేసుకున్నప్పుడు.. ప్రాంతాల మధ్య జనాభా వ్యత్యాసాలు ఏర్పడినప్పుడు నియోజకవర్గాల సరిహద్దులను.. అవసరమైనప్పుడు వాటి సంఖ్యను పునర్వ్యవస్థీకరించడాన్ని డీలిమిటేషన్ అని పిలుస్తుంటారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 5 లక్షల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. మరో నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఉండవచ్చు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గం డి లిమిటేషన్ లక్ష్యం. దీనివల్ల అసెంబ్లీ.. పార్లమెంట్ నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ఎస్సి. ఎస్టి రిజర్వుడ్ స్థానాల సంఖ్య, వాటి స్థానాలు మారవచ్చు.

2008లో ఉమ్మడి ఏపీలో ఏం జరిగిందంటే

2001 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దీనికోసం 2002లో డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏపీలో డీలిమిటేషన్ కమిషన్ 2007లో తన ప్రధాన ఉత్తర్వులను జారీ చేసింది. 2008లో సవరణలు.. తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. పునర్విభజన తర్వాత ఉమ్మడి డిపి లో అసెంబ్లీ స్థానాలు 294. పార్లమెంటు స్థానాలు 42 కు చేరుకున్నాయి. ఇందులో ఎస్సీ అసెంబ్లీ స్థానాలు 29.. ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఏడు కు పెరిగాయి. దీని ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294 గానే సాగింది. నియోజకవర్గాల సరిహద్దు.. కొన్ని నియోజకవర్గాల పేర్లు.. రిజర్వేషన్ స్థానాలలో మార్పులు చోటుచేసుకున్నాయి.. నాటి డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభాకు అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చారు. గ్రామీణ ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన మార్పులు చేశారు. ఎస్సీ, ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించారు. ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు.. మరో నియోజకవర్గంలోకి వెళ్లాయి. 2008 డీలిమినేషన్ తర్వాత జరిగిన 2009 ఎన్నికలు ఈ కొత్త నియోజకవర్గాల ఆధారంగానే జరిగాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఈ నియోజకవర్గాల వ్యవస్థనే ప్రాతిపదికగా తీసుకున్నారు.

1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాల కేటాయింపులు 2001 వరకు కొనసాగించారు. జనాభా నియంత్రణ కార్యకలాపాలను సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత 84వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు అసెంబ్లీ స్థానాల రాష్ట్రాల చేయడానికి తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మళ్లీ సమీక్షించే విధానాన్ని తీసుకొచ్చారు. 87 వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను సవరించడానికి అవకాశం కల్పించారు.

రాష్ట్ర విభజన తర్వాత

2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175.. తెలంగాణలో 119 ఉన్నాయి. ఇందులో ఏపీలో ఎస్సీ అసెంబ్లీ స్థానాలు 29, తెలంగాణలో 19 ఉన్నాయి. ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఏపీలో ఏడు, తెలంగాణలో 12 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 ప్రకారం ఏపీ అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 కి పెరగాలి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153 కి పెరగాలి. అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి 84 అదనపు అసెంబ్లీ స్థానాలు రావాలి అనే నిబంధన ఉండేది. అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కి లోబడి ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే స్థానాలను పెంచలేకపోయింది. 2026 తర్వాత జనాభా లెక్కలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలపై ఆధారపడి ఈ ప్రక్రియ జరగాల్సి ఉండేది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి డిలిమిటేషన్ మీద రాజకీయ చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడం. పార్లమెంట్.. అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడం. 2026 ఏప్రిల్ లో కేంద్రం ప్రవేశపెట్టిన డిలిమిటేషన్ సంబంధిత బిల్లుకు పార్లమెంట్ల అవసరమైన మద్దతు లభించలేదు. ఇప్పుడు కేంద్రం కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తోంది. లోక్సభ స్థానాలను 543 నుంచి 50% పెంచే ప్రతిపాదన. రాష్ట్రాలవారీగా ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడే ప్రతిపాదన. కొత్త నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ఉపయోగించాలని ప్రతిపాదన. రెండు ప్రాంతాల మధ్య సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే ప్రతిపాదన. మహిళలకు 33% రిజర్వేషన్ అమలకు మార్గం కల్పించడం. రాష్ట్రాల అసెంబ్లీ గరిష్ట పరిమితిని 500 నుంచి 650 కి పెంచే ప్రతిపాదన. అయితే ఈ ప్రతిపాదనలో ఇంకా పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారలేదు గాని.. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్య ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో వీటిపై చర్చ.. ఓటింగ్ జరుగుతుంది.

దీనివల్ల తెలంగాణకు ఏం లాభం

కేంద్రం ప్రతిపాదించిన 50% పెంపులెక్క ప్రకారం పార్లమెంటు స్థానాలు 17 నుంచి 26 పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు కూడా 119 నుంచి సుమారు 178 కి పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్.. సికింద్రాబాద్.. మల్కాజ్గిరి.. చేవెళ్ల వంటి పార్లమెంటు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు వస్తాయి. హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని విభజించి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జనాభా లెక్కలు.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రిజర్వు స్థానాల సంఖ్య.. వాటి స్థానాలు మారే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాలలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి. ఎక్కువ స్థానాలు ఏర్పడితే కొత్త నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పెరిగితాయి. నియోజకవర్గాల వారిగా పార్టీలు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పట్టణం.. గ్రామీణ ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఏపీకి ఏం ప్రయోజనం

ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు 25 ఉన్నాయి. 50% పెంపు ప్రతిపాదన ప్రకారం పార్లమెంటు స్థానాలు 25 నుంచి 38 పెరిగే అవకాశం ఉంది. 2014 విభజన చట్టం ప్రకారం ఏపీ అసెంబ్లీ స్థానాలు 225 కు.. తెలంగాణ స్థానాలు 153 కు పెరగాలి అనే నిబంధన ఉండేది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం పెంపు ఈ పాత నిబంధనతో ఎలా సమన్వయం అవుతుందో చూడాల్సి ఉంది. అమరావతి.. విజయవాడ.. విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం ఉంది. కొత్త అసెంబ్లీ స్థానంలో ఏర్పడితే స్థానిక నాయకులకు అవకాశాలు పెరుగుతాయి. రాయలసీమ.. కోస్తా ఆంధ్ర.. ఉత్తరాంధ్ర ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు ఏర్పడతాయి. ఎస్సీ.. ఎస్టి రిజర్వేషన్ స్థానాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper