India vs New Zealand:గిల్.. రాహుల్.. జైస్వాల్.. పంత్.. ఇలా తోపు బ్యాటర్లు అవుట్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఫాలో ఆన్ గండం పొంచి ఉంది. ఈ దశలో ధ్రువ్ జూరెల్ రంగంలోకి దిగాడు. న్యూజిలాండ్ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించాడు. కొరకరాని కొయ్యలాగా మారిపోయాడు. గంటల తరబడి మైదానంలో సహనంతో బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను శిక్షించాడు. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. మొత్తంగా టీమ్ ఇండియాకు గౌరవాన్ని అందించాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ వికెట్ కీపర్ ధ్రువ్ జూరెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన చోట గంటల తరబడి నిలబడి జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. క్రైస్ట్ చర్చిలోని హగ్లీ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో జూరెల్ బ్యాటింగ్ భారత అభిమానులకు ఆశలు కలిగించింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టుకు ప్రారంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. కీలక ఆటగాళ్లు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక దశలో 116 పరుగులకే భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఫాలో ఆన్ ప్రమాదం కూడా ఎదురైంది.
ఇటువంటి పరిస్థితుల్లో జూరెల్ బాధ్యత తీసుకున్నాడు. న్యూజిలాండ్ ఫేసు బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని ఆచితూచి ఎదుర్కొన్నాడు. వికెట్ కాపాడుకున్నాడు. పరుగులు సాధించడానికి అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదాడు. ఆకాష్ దీప్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆకాష్ దీప్ 52 బంతుల్లో 29 పరుగులు చేసి జూరెల్ కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఎనిమిదవ వికెట్ కు 46 పరుగులు జోడించారు. ఆ తర్వాత గుర్నూర్ బ్రార్ తో కలిసి జూరెల్ కీలక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే క్రమంలో జూరెల్ తన టెస్ట్ కెరియర్ లో నాలుగవ అర్థ సెంచరీ చేశాడు. 170 బంతులు ఎదుర్కొన్న అతడు.. 14 ఫోర్ లతో 88 పరుగులు చేశాడు. ఆకాష్ దీప్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు 46 పరుగులు.. గుర్నూర్ బ్రార్ తో కలిసి తొమ్మిదవ వికెట్ 64 పరుగులు జోడించాడు. బుమ్రా తో కలిసి పదో వికెట్ కు 19 పరుగులు జోడించాడు. వాస్తవానికి జూరెల్ ఔట్ అవ్వకుండా ఉండి ఉంటే టీమిండియా మరింత మెరుగైన స్కోర్ చేసేది.
న్యూజిలాండ్ బౌలర్లు క్రమ తప్పకుండా వికెట్లు తీసుకున్న క్రమంలో..జూరెల్ చూపించిన అందరిని ఆకట్టుకుంది. అతని పోరాటం వల్ల భారత్ ఫాలో అను ప్రమాదం నుంచి బయటపడింది. అయితే టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసింది. న్యూజిలాండ్తో ఇన్నింగ్స్ లో 356 పరుగులు చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులు వెనుకబడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఈ కథనం రాసే సమయం వరకు న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. లాతం (8) బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కాన్వే (31), నికోలస్ (22) బ్యాటింగ్ చేస్తున్నారు. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. రెండో వికెట్ కు ఇప్పటివరకు 40 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
Take a bow, Dhruv jurel. what a knock.
The consistency, the class and the quality ghat dhruv jurel brings to the game are on another level.
#DhruvJurel https://t.co/SF7gybHUzN
— (@india_youth_1) November 29, 2026