Homeఎంటర్టైన్మెంట్Ghattamaneni Jayakrishna : ఆ హీరోయిన్ తో డేట్ చేస్తానంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్ కామెంట్స్..

Ghattamaneni Jayakrishna : ఆ హీరోయిన్ తో డేట్ చేస్తానంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్ కామెంట్స్..

Ghattamaneni Jayakrishna : సూపర్ స్టార్ కృష్ణ మనవడు , రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచానాల నడుమ విడుదలై ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు బాగానే చేశారు కానీ , డైరెక్టర్ ఆశించిన స్థాయి స్టోరీ ని డెవలప్ చేయకపోవడం వల్లే తేడా కొట్టిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ […]

Ghattamaneni Jayakrishna : సూపర్ స్టార్ కృష్ణ మనవడు , రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచానాల నడుమ విడుదలై ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు బాగానే చేశారు కానీ , డైరెక్టర్ ఆశించిన స్థాయి స్టోరీ ని డెవలప్ చేయకపోవడం వల్లే తేడా కొట్టిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమా విడుదలకు ముందు జయకృష్ణ చేసిన ప్రొమోషన్స్ మామూలివి కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క ఈవెంట్ కి అయినా వస్తారని అనుకున్నారు కానీ , ఆయన రాలేదు. దీంతో ప్రొమోషన్స్ బాధ్యత మొత్తం జయకృష్ణ నే తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ సినిమాకు ఓపెనింగ్స్ ని తీసుకొని రావడం లో సహాయపడ్డాయి.

ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ జయకృష్ణ ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. అందులో భాగం గా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు అవకాశం వస్తే , ఏ హీరోయిన్ తో డేట్ చేస్తారు’ అని అడగ్గా, అందుకు జయకృష్ణ సమాధానం చెప్తూ ‘నాకు సినీ ఇండస్ట్రీ లో వ్యక్తిగతంగా తెలిసిన ఏకైక హీరోయిన్ రషా టాండన్ మాత్రమే. అవకాశం వస్తే ఆమెతోనే డేట్ కి వెళ్తాను’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఘట్టమనేని జయకృష్ణ. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రషా టాండన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రవీనా టాండన్ కూతురు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె కూడా ఈ చిత్రంతోనే వెండితెర అరంగేట్రం చేసింది.

తన క్యూట్ లుక్స్ తో మొదటి సినిమాతోనే రషా టాండన్ కుర్రాళ్లలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది కుర్ర హీరోయిన్స్ కంటే ఈమె చాలా బెటర్ అని అనిపించుకుంది. ఇక జయకృష్ణ కూడా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నారు. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది , భవిష్యత్తులో సరైన కథలు ఎంచుకొని ముందుకెళ్తే తన బాబాయ్ మహేష్ బాబు లాగానే పెద్ద రేంజ్ కి వస్తాడంటూ సోషల్ మీడియా లో ‘శ్రీనివాస మంగపురం’ చిత్రాన్ని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రం రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అని అనిపించే రేంజ్ లనే వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper