OTT Movies: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 260 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకు టాక్ కి తగ్గ ఓపెనింగ్స్ రాలేదు. తెలుగు లో మంచి ఓపెనింగ్ వచ్చింది కానీ , తమిళం లో ఓపెనింగ్స్ రాకపోవడం తో , ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ చిత్రానికి చాలా మంచి లాంగ్ రన్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాని నేడు నెట్ ఫ్లిక్స్ లో గ్రాండ్ గా విడుదల చేశారు.
అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమా తెలుగు , తమిళం , హిందీ భాషలతో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఎందుకంటే గతం లో ఇదే వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఒక ప్రభంజనమే సృష్టించింది. ఇండియా లో RRR తర్వాత అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న తెలుగు సినిమా ఇదే. విశ్వనాధ్ & సన్స్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం ఇకపై వెంకీ అట్లూరి సినిమాలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కనీవినీ ఎరుగని రేంజ్ రేట్స్ కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
ఇకపోతే ఈ చిత్రం తో విశాల్ స్వీయ దర్శకత్వం లో హీరో గా నటించిన ‘మకుటం’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేడు విడుదలైంది. తెలుగు , తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు. అదే విధంగా జీ5 లో తమిళ హీరో భారత్ నటించిన ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ కూడా నేడే స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక నిఖిల్ అద్వానీ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియాడికల్ వెబ్ సిరీస్ ‘ది రివల్యూషనరీస్’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. ఇలా వీకెండ్ లో మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించే వివిధ జానర్ సినిమాలు , వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి.