Homeబిజినెస్Phone pe free UPI payment App: మరి వేల కోట్ల ఆదాయం ఎలా వస్తోంది..

Phone pe free UPI payment App: మరి వేల కోట్ల ఆదాయం ఎలా వస్తోంది..

Phone pe free UPI payment App: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి phone pe గురించి తెలిసే ఉంటుంది. టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా phone pe QR code కనిపిస్తుంది. చిన్న మొత్తాల నుంచి వేల రూపాయల వరకు చాలామంది ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరుపుతుంటారు. మరవైపు ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి ఖాతాకు డబ్బులు పంపినా ఎటువంటి చార్జీలు ఉండవు. మరి వినియోగదారులకు […]

Phone pe free UPI payment App: స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి phone pe గురించి తెలిసే ఉంటుంది. టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా phone pe QR code కనిపిస్తుంది. చిన్న మొత్తాల నుంచి వేల రూపాయల వరకు చాలామంది ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరుపుతుంటారు. మరవైపు ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి ఖాతాకు డబ్బులు పంపినా ఎటువంటి చార్జీలు ఉండవు. మరి వినియోగదారులకు ఉచితంగా UPI సేవలందిస్తున్న ఫోన్ పే కంపెనీ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలా సంపాదిస్తోంది.. అసలు ఈ కంపెనీ వ్యాపార మోడల్ ఏమిటి..

యూపీఐ ఉచితం.. కానీ కంపెనీ వ్యాపారం మాత్రం భారీగా

సాధారణంగా ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపితే ఎటువంటి చార్జీ ఉండదు. సాధారణ బ్యాంకు ఖాతా ఆధారిత యూపీఐ చెల్లింపులపై జీరో ఎండిఆర్ విధానం అమల్లో ఉంటుంది. అంటే ప్రతి యూపీఐ లావాదేవీపై ఫోన్ పే నేరుగా వినియోగదారుడు నుంచి డబ్బులు వసూలు చేయదు. అయితే ఈ యాప్ లో జరిగే ఇతర సేవలు.. వ్యాపార లావాదేవీలు కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

ఫోన్ పే వ్యాపారంలో ప్రధాన ఆదాయ వనరు పేమెంట్ సర్వీసులే.. మొబైల్ రీఛార్జ్ లు.. విద్యుత్ బిల్లులు.. ఇతర యుటిలిటీ బిల్లుల చెల్లింపు.. బంగారం కొనుగోలు.. ప్రయాణ టికెట్లు వంటి బుకింగ్ సేవల ద్వారా కంపెనీకి ఆదాయం వస్తూ ఉంటుంది. కొన్ని సేవలకు కన్వీనియన్స్ ఫీజు లేదా ట్రాన్స్ యాక్షన్ ఫీజు వసూలు చేస్తూ ఉంటుంది.

షాపులో యజమానుల నుంచి ఆదాయం

ఫోన్ పే అసలు వ్యాపార రహస్యం ఇక్కడే ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది దుకాణాలు.. వ్యాపార సంస్థలు ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తూ ఉంటాయి. వ్యాపారులకు పేమెంట్ సౌకర్యాలు.. స్మార్ట్ స్పీకర్లు.. పి ఓ ఎస్ మిషిన్లు.. పేమెంట్ గేటు సేవలను అందిస్తోంది. దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్.. పరికరాల నిర్వహణ.. ఇతర సేవల రూపంలో ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది.

ఇన్సూరెన్స్.. లోన్ల ద్వారా కమిషన్లు

ఫోన్ పే కేవలం పేమెంట్ యాప్ మాత్రమే కాదు. బీమా పాలసీలను కూడా విక్రయిస్తూ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్.. లైఫ్ ఇన్సూరెన్స్.. ఇతర భీమా ఉత్పత్తులను కస్టమర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. కస్టమర్లు పాలసీలు తీసుకున్నప్పుడు బీమా సంస్థల నుంచి కమిషన్లను పొందుతూ ఉంటుంది. అలాగే బ్యాంకులు.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కలిసి రుణాలను అందించే ప్రక్రియలు భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉంటుంది. రుణాలు ఇచ్చినందుకు సర్వీస్ ఫీజులు.. కమిషన్లు సంపాదిస్తూ ఉంటుంది.

షేర్ మార్కెట్.. ఇతర వ్యాపారాలు

ఫోన్ పే షేర్ మార్కెట్ పెట్టుబడులు.. స్టాక్ బ్రోకింగ్.. మ్యూచువల్ ఫండ్ పంపిణీ వంటి సేవలలోకి కూడా ప్రవేశించింది. వీటి ద్వారా బ్రోకరేజ్.. కమిషన్లు.. ఇతర సర్వీస్ చార్జీల రూపంలో ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది.

ప్రకటన ద్వారా ఆదాయం

ఫోన్ పే యాప్ లో వివిధ బ్రాండ్లు.. కంపెనీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. భారీ సంఖ్యలో కస్టమర్లు ఈ యాప్ ను ఉపయోగిస్తూ ఉంటారు. తద్వారా ప్రకటనలకు మంచి ఆదాయం ఉంటుంది. ఆయా సంస్థల నుంచి ప్రకటనల రూపంలో దండిగా ఆదాయం లభిస్తూ ఉంటుంది.

2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఫోన్ పే 7115 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సంపాదించింది. ఇందులో పేమెంట్ సేవలు రూపంలో 6300 కోట్లు.. ఇన్సూరెన్స్ లెండింగ్ సేవల ద్వారా 557.6 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. కాకపోతే ఆ ఏడాది 1727 కోట్ల నికర నష్టాన్ని ఫోన్ పే నమోదు చేయడం విశేషం.

ఫోన్ పే మొదట కస్టమర్లకు ఉచిత యూపీఐ సేవలు అందించి.. భారీ కస్టమర్ నెట్వర్క్ నిర్మించుకుంది. ఆ తర్వాత కస్టమర్లకు రీఛార్జ్ లు.. బిల్లుల చెల్లింపులు.. బీమా, రుణాలు, పెట్టుబడుల సేవలను అందిస్తోంది. మరోవైపు వ్యాపారులకు పేమెంట్ పరికరాలు.. గేట్ వే సదుపాయాలు కల్పిస్తోంది. కస్టమర్లకు ఉచితంగా డబ్బులు పంపుకునే సౌకర్యం కల్పించడం ఒకవైపు.. వినియోగదాల ద్వారా ఇతర సేవలను అందించి ఆదాయం సంపాదించడం మరోవైపు.. ఇదే ఫోన్ పే వ్యాపార నమూనాలో ప్రధాన వ్యూహం

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper