Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘కాకా’ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ హిట్ తర్వాత డైరెక్టర్ బాబీ తో మెగాస్టార్ చేయబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లాయి. ఇకపోతే ఈ సినిమా జనవరి 13 న విడుదల అవ్వడం లేదని,వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యం లో, మూవీ టీం సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 13 నుండి ‘కాకా’ ఆధిపత్యం ప్రతీ ప్రాంతం లోనూ ఉండబోతుంది అంటూ వాయిదా రూమర్స్ కి చెక్ పెడుతూ ఒక పోస్టర్ ని విడుదల చేశారు. దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు.
అసలు ఈ వాయిదా వార్తలు రావడానికి ముఖ్య కారణం ‘విశ్వంభర‘. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అంజి తర్వాత తెరకెక్కిన భారీ బడ్జెట్ గ్రాఫికల్ వండర్ ఇది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండేళ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మరింత క్వాలిటీ గా ఉండాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ ఎట్టిపరిస్థితిలోనూ సంక్రాంతి బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఆ కారణం చేత ‘కాకా‘ చిత్రం వాయిదా పడుతుందని, ఇలా రకరకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ , ఎవరు వచ్చినా రాకపోయినా, మేము మాత్రం జనవరి 13 న వస్తున్నాము అనే స్టైల్ లో ‘కాకా‘ టీం సంచలన ప్రకటన చేసింది. ఒకవేళ విశ్వంభర, కాకా చిత్రాలు రెండు సంక్రాంతి సీజన్ లో విడుదలైతే పరిస్థితి ఏంటి?.
మెగా ఫ్యాన్స్ ముందుగా ‘కాకా‘ చిత్రానికి వెళ్తారా?, లేదా విశ్వంభర చిత్రానికి వెళ్తారా? అనేది ఆసక్తికరమైన విషయం. గతంలో ఇలాంటి సందర్భం బాలయ్య బాబు కి మాత్రమే ఎదురైంది. ఆరోజుల్లో బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. రెండు కూడా కమర్షియల్ గా హిట్ అయ్యాయి. ఇప్పుడు చిరంజీవి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. సాధ్యమైనంత వరకు ఆయన రెండు సినిమాల్లో ఎదో ఒక సినిమాని సంక్రాంతి సీజన్ లో రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తాడు. ఇక తప్పదు అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆయన కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.