Viswanath & Sons: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి కానీ , తమిళనాడు లో మాత్రం వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఈ చిత్రం బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించేలా అనిపిస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 6 రోజుల్లో తమిళనాడు రాష్ట్రం నుండి 35 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 38 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయలకు జరగ్గా , 6 రోజుల్లో 22 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా కర్ణాటక నుండి ఈ చిత్రానికి 10 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు రాగా , కేరళ నుండి 6 కోట్ల 55 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 40 లక్షలు , ఓవర్సీస్ నుండి 46 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 138 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 66 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా పూర్తి స్థాయిలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటు కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల్లో ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యాలి. అంటే ఈ సినిమా వచ్చే నెల 14 వ తేదీన తెలుగు , తమిళం , హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది అన్నమాట. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఇండియాలోనే అత్యధిక వ్యూస్ వచ్చాయి. అదే డైరెక్టర్ నుండి నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘విశ్వనాధ్ & సన్స్’ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.