Aliaas Rukmini: వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్, వచ్చే నెల 4 వ తేదీన ‘అలియాస్ రుక్మిణి’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నాని గురించి నితిన్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం అందిస్తే అతన్ని దేవుడు అంటాము..అలా నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, నాకు దేవుడిలా వచ్చి, ఇంత గొప్ప సినిమాని నా చేతుల్లో పెట్టాడు అంటూ నాని పై తన అభిమానాన్ని చూపిస్తూ, దగ్గరకు పిలిచి కౌగలించుకొని ముద్దు పెడుతాడు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయని, కానీ ఈ సినిమా వాటి అన్నిటిని బీట్ చేసేంత గొప్పగా ఉంటుందని, నాని నా చేతుల్లో బంగారు పళ్లెం పెట్టాడని నితిన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారా?, ఎప్పుడెప్పుడు టికెట్స్ బుక్ చేసుకుందామా అనే ఆత్రుతతో ఉన్నారు ఆడియన్స్. అంతే కాదు ఈ ఈవెంట్ లో నాని, నితిన్ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నితిన్ స్టార్ గా కొనసాగుతున్న రోజుల్లో ఆయన హీరో గా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడట. ఆ సమయం లో నాని హీరో నితిన్ ని పేరు పెట్టి పిలిచేవాడట. ఇది నితిన్ మ్యానేజర్ కి అసలు నచ్చేది కాదట. దీంతో నితిన్ అతని అసిస్టెంట్ కి బాగా కాలే లాగా, నాని కి గొడుగు పట్టి, అతని భుజం పై చెయ్యి వేసి, సెట్స్ లోకి అడుగుపెట్టాడట. ఈ సందర్భాన్ని నిన్నటి ఈవెంట్ లో పంచుకున్న వీళ్లిద్దరు, మరోసారి అదే సీన్ ని రీ క్రియేట్ చేస్తూ స్టేజి మీదకు వచ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అదే విధంగా యాంకర్ సుమ తో కూడా నితిన్ కాసేపు ఫన్నీ సంభాషణ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘అలియాస్ రుక్మిణి’ ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ కోసం సుమ గారి ఇంటికి వెళ్లాను, ఆరోజే దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. అతను రాగానే కారు దగ్గరకు వెళ్లి, గట్టిగా కౌగలించుకొని, సకల మర్యాదలు చేసి సుమ గారు ఆహ్వానించారు, కానీ నన్ను మాత్రం పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సుమ మాకు కేరళ లో ఒక గ్రూప్ ఉంది. వాళ్ళ కోసం స్పెషల్ గా ఆ ఫోటోలు దిగాను అంటూ చెప్పుకొచ్చింది. నేను ఆరోజు హగ్ ఇవ్వడం మిస్ అయ్యాను, కానీ ఈరోజు అవ్వను అంటూ నితిన్ కి సుమ హగ్ ఇస్తుంది. ఈ విజువల్స్ నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్స్ గా నిలిచాయి.