Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: మితిలేష్ ని కొట్టబోయిన రోహిత్..గందరగోళంగా మారిన 'అగ్నిపరీక్ష 2' సక్సెస్...

Bigg Boss 10 Telugu: మితిలేష్ ని కొట్టబోయిన రోహిత్..గందరగోళంగా మారిన ‘అగ్నిపరీక్ష 2’ సక్సెస్ పార్టీ!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలబడాల్సిన రోహిత్, హౌస్ లోని కుట్రలు కుతంత్రాల కారణంగా కంటెస్టెంట్స్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే రోహిత్ లో ఆ కోపం , బాధ ఇంకా అలాగే ఉండిపోయిందో ఏమో తెలియదు కానీ, ఈమధ్య చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. రీసెంట్ గానే ‘స్టార్ మా పరివారం’ షో లో నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2 సక్సెస్ పార్టీ’ ఈవెంట్ లో పాల్గొన్న […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలబడాల్సిన రోహిత్, హౌస్ లోని కుట్రలు కుతంత్రాల కారణంగా కంటెస్టెంట్స్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే రోహిత్ లో ఆ కోపం , బాధ ఇంకా అలాగే ఉండిపోయిందో ఏమో తెలియదు కానీ, ఈమధ్య చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. రీసెంట్ గానే ‘స్టార్ మా పరివారం’ షో లో నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2 సక్సెస్ పార్టీ’ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్, మితిలేష్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ షో లో ‘అగ్నిపరీక్ష 2′ కంటెస్టెంట్స్ కి నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ లో ముందుగా రోహిత్, అపూర్వ మధ్య తారా స్థాయి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రోహిత్, మితిలేష్ మధ్య అంతకు మించిన ఫైట్ జరిగింది. ఈ ఫైట్ ని చూసాక అభిమానులు కూడా రోహిత్ ని తప్పుబట్టే పరిస్థితి వచ్చింది. ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నాడు.

‘అగ్ని పరీక్ష 2’ సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి చర్చకు రాగా, రోహిత్ , మితిలేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విషయం లోకి వెళ్తే ‘అగ్ని పరీక్ష 2′ సమయంలో బట్టలు సర్దే టాస్క్ ఒకటి మితిలేష్, షాలిని మధ్య జరుగుతుంది, అది మీకు గుర్తుందా?, ఆ టాస్క్ లో షాలిని గెలిచే స్తానం లో ఉన్నప్పటికీ, మితిలేష్ బట్టలను విసిరి పారేస్తుంది. ‘స్టార్ మా పరివారం‘ ఎపిసోడ్ లో షాలిని అపూర్వ ని నామినేషన్ చేసినప్పుడు, అపూర్వ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ తప్పుబడుతుంది. అప్పుడు రోహిత్ మధ్యలో కలగచేసుకొని ఎవరైనా గేమ్ లో అవతల వాళ్ళని ఓడించాలనే చూస్తారు కదా, అదే షాలిని కూడా చేసింది అని అంటాడు. అప్పుడు మితిలేష్ ఆమె అప్పటికే గెలిచే స్థానం లో ఉంది అని అంటాడు. అందుకు రోహిత్ అరేయ్ అది తన ఇష్టంరా, నేను ఆమెతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరుతావ్ అని అంటాడు. అప్పుడు మితిలేష్ అది నా టాస్క్ రా, అందుకే రియాక్ట్ అయ్యానని అంటాడు. ఆ సమయం లో మితిలేష్ ‘రా’ అనడం రోహిత్ కి నచ్చలేదు. దీనికి ట్రిగర్ అయిపోయిన రోహిత్, నన్ను ‘రా’ అనకు అంటూ కొట్టబోయాడు.

ఆ తర్వాత వాళ్ళిద్దరి పెద్ద మాటల యుద్ధమే నడిచింది. అప్పుడు మితిలేష్ అవినాష్ తో మాట్లాడుతూ, రోహిత్, షాలిని ఉండే షో కి నేను రాను అని ముందే చెప్పాను, ఇప్పుడు చూడండి ఏమైందో, ఇక మీరే మ్యానేజ్ చేసుకోండి అంటూ షో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు షాలిని 15 లక్షల డబ్బులు కోసం హౌస్ లో ఉన్నప్పుడు మా అందరినీ అడుకున్నాడు. అప్పుడు రోహిత్ , షాలిని అవసరం లేదా అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే జరిగిన ఈ సంఘటన లో ఈ రేంజ్ అగ్రెషన్ రోహిత్ కి అవసరం లేదని అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ముందుగా రోహిత్ నే మితిలేష్ ని రా అని పిలిచాడు. తిరిగి మితిలేష్ పిలిస్తే రోహిత్ ఇంత రచ్చ చేసాడు. ఇది విన్నర్ కి ఉండాల్సిన లక్షణం కాదని, రోహిత్ ఎందుకో అవసరానికి మించి రియాక్ట్ అయ్యాడని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper