Homeఎంటర్టైన్మెంట్Allu Arjun And Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డైలాగ్ రైటర్స్ గా శ్రీను...

Allu Arjun And Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డైలాగ్ రైటర్స్ గా శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి..? ఇదేమి ట్విస్ట్ సామీ!

Allu Arjun And Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #AA22 మూవీ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా ముంబై లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 40 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేశారట. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో […]

Allu Arjun And Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #AA22 మూవీ షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా ముంబై లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 40 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేశారట. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో అల్లు అర్జున్, తమిళ కమెడియన్ యోగి బాబు మధ్య కొన్ని కామెడీ ట్రాక్స్ ఉంటాయట. ఇవి చూసే ఆడియన్స్ కి చాలా హిలేరియస్ గా అనిపిస్తాయని టాక్. ఈ కామెడీ ట్రాక్స్ ని అట్లీ రాయలేదు. అల్లు అర్జున్ స్పెషల్ రిక్వెస్ట్ మీద కొన్ని కామెడీ ట్రాక్ సన్నివేశాలను శ్రీను వైట్ల చేత రాయించారట.

ఆయనతో పాటు అనిల్ రావిపూడి తో కూడా అల్లు అర్జున్, యోగి బాబు మధ్య కామెడీ ట్రాక్స్ ని రాయించారట. ఇండియా లోనే మొట్టమొదటి సూపర్ హీరో సినిమా అని అన్నారు, అలాంటి జానర్ సినిమాలో కామెడీ ట్రాక్ ఏంటి?, డైరెక్టర్ అట్లీ కి అసలు బుర్ర ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారట. కానీ ఈ కామెడీ ట్రాక్ బలవంతంగా ఇరికించింది కాదని, సినిమా కథ దృష్ట్యా అది కచ్చితంగా అవసరమని అంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్, యోగి బాబు స్నేహితులుగా నటిస్తున్నారు. సినిమా ఆరంభం నుండి చివరి వరకు వీళ్లిద్దరు కలిసి ఉంటారట. వీళ్ళ మధ్య కామెడీ ట్రాక్ సన్నివేశాలు మాత్రమే కాదు, మంచి ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని టాక్. వాటిని ఈ ఇద్దరి డైరెక్టర్స్ తోనే రాయించినట్టు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇలా చేయడం ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు సమాంతరంగా ప్రపంచాలు సంబంధించినది మాత్రమే కాదు, పునర్జన్మల నేపథ్యం, టైం ట్రావెల్ నేపథ్యం కూడా ఉంటుందట. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. విలన్ క్యారెక్టర్ కూడా ఆయనే చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్, దీపికా పదుకొనే నటిస్తుండగా, విలన్ క్యారెక్టర్ లో రష్మిక మందాన నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లోకి అడుగుపెట్టిన రష్మిక పై సోలో గా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాడట డైరెక్టర్ అట్లీ . శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper