Homeఎంటర్టైన్మెంట్Agnipariksha 2: 'అగ్నిపరీక్ష 2' లో ఒకేసారి 8 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్.. ఇంతటి...

Agnipariksha 2: ‘అగ్నిపరీక్ష 2’ లో ఒకేసారి 8 కంటెస్టెంట్స్ ఎలిమినేషన్.. ఇంతటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు..

Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఆడిషన్స్ ఎపిసోడ్స్ ఈ రేంజ్ రెస్పాన్స్ మొదటి సీజన్ కి రాలేదనే చెప్పాలి. ఎక్కువ శాతం ఆడిషన్స్ ఆడియన్స్ లో నెగెటివిటీ ని పెంచేలా చేశాయి, కానీ కంటెంట్ మాత్రం బాగానే వైరల్ అయ్యింది. ఇకపోతే ఈరోజుటి ఎపిసోడ్ లో జడ్జీలు చేసిన కొన్ని పనులు చప్పట్లు కొట్టేలా చేసింది , కొన్ని పనులు విపరీతమైన కోపం రప్పించేలా చేసింది. అందులో ఒకటి హోల్డ్ […]

Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఆడిషన్స్ ఎపిసోడ్స్ ఈ రేంజ్ రెస్పాన్స్ మొదటి సీజన్ కి రాలేదనే చెప్పాలి. ఎక్కువ శాతం ఆడిషన్స్ ఆడియన్స్ లో నెగెటివిటీ ని పెంచేలా చేశాయి, కానీ కంటెంట్ మాత్రం బాగానే వైరల్ అయ్యింది. ఇకపోతే ఈరోజుటి ఎపిసోడ్ లో జడ్జీలు చేసిన కొన్ని పనులు చప్పట్లు కొట్టేలా చేసింది , కొన్ని పనులు విపరీతమైన కోపం రప్పించేలా చేసింది. అందులో ఒకటి హోల్డ్ లో పెట్టిన కంటెస్టెంట్స్ ని ఎలాంటి కారణం లేకుండా ఎలిమినేట్ చేయడమే. అయితే ఇది విన్నప్పుడు మొదట్లో జడ్జీలపై కాస్త కోపం వచ్చిన విషయం వాస్తవమే, కానీ ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం కాస్త న్యాయంగానే వ్యవహరించారని అనిపించింది. ముగ్గురు జడ్జీలతో పాటు , శ్రీముఖి కూడా ఈ ప్రక్రియ లో పాల్గొన్నది.

చాలా సేపటి వరకు సుదీర్ఘంగా చర్చించారు కూడా. అయితే 8 మంది కంటెస్టెంట్స్ ముందుకు వెళ్ళలేరేమో అనే నిర్ణయానికి వచ్చి , జడ్జీలు ఎలిమినేట్ చేశారు. కేవలం లుక్స్ , ఎమోషనల్ స్టోరీలను చూసి వీళ్ళను ఆడిషన్స్ లో హోల్డ్ లో పెట్టారు. అందుకే ఇప్పుడు నలుగురు చర్చించుకొని ఎలిమినేట్ చేసి సరైన నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఇక్కడ తప్పు చేసింది ఏంటంటే, ఈ నిర్ణయం ఎదో ముందే తీసుకొని ఉండుంటే బాగుండేది కదా అని. హోల్డ్ లో పెట్టినప్పుడు కంటెస్టెంట్స్ కచ్చితంగా తమను తాము నిరూపించుకునే అవకాశం వచ్చింది అని సంతోషించి ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇలా వాళ్ళని హోల్డ్ లో పెట్టి, ఎలిమినేట్ చేస్తున్నాము అని చెప్తే , వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకున్నట్టు అవుతుంది కదా, ఇదెక్కడి న్యాయం చెప్పండి ? అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

అది కూడా కాకుండా జనాల్లో ఈ షో మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ట్రాన్స్ జెండర్స్ కి వీళ్ళు అవకాశం ఇవ్వడం లేదని. ఉప్పల్ బాలు ని అలాగే అవమానించి పంపించారు , అదే విధంగా మరో ట్రాన్స్ జెండర్ గౌరీ త్రినేత్ర ని హోల్డ్ లో పెట్టి , నిన్న ఎలిమినేట్ చేశారు. ఇలా వరుసగా ఆ క్యాటగిరీ కి చెందిన వాళ్ళని తప్పించడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనిపై జడ్జీలు , యాంకర్ శ్రీముఖి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper