Priya Bhavani Shankar: ఇతర భాషలకు సంబంధించిన హీరోయిన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ , ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా తమిళం నుండి వచ్చే హీరో హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తమ అభిమాన హీరో అని చెప్తుంటారు, అదే విధంగా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ , ప్రభాస్ పేర్లను చెప్తుంటారు. కానీ కేరళ , కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నటులు ఇక్కడికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ కి వీరాభిమానులం అని చెప్తుంటారు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. రీసెంట్ గా ఆ జాబితాలోకి తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా చేరిపోయింది. తమిళనాడు లో అనేక టీవీ సీరియల్స్ , టీవీ షోస్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా భవాని శంకర్.
ఈమెకు అక్కడి యూత్ ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె కేవలం ‘దూత’ అనే వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించింది. ‘ఇరుముడి’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేయబోతుంది. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా , ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రియా భవాని శంకర్ చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తోంది. అందులో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ , ప్రభాస్.. వీరిద్దరిలో ఎవరు మీకు బాగా ఇష్టం అని అడగ్గా, క్షణం కూడా ఆలోచించకుండా అల్లు అర్జున్ పేరు చెప్పేసింది ప్రియా భవాని శంకర్.
సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు హీరోయిన్స్ సమాధానాన్ని దాటవేస్తూ ఉంటారు. అత్యధిక శాతం మంది హీరోయిన్లు చాలా డిప్లొమేటిక్ గా , సేఫ్ సైడ్ లో సమాధానం చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో అవకాశాలు కోసం అలా చెప్తుంటారు. కానీ ప్రియా భవాని శంకర్ మాత్రం అందుకు భిన్నంగా , ఉన్నది ఉన్నట్టుగా దాచుకోకుండా సమాధానం చెప్పింది. దీనిపై సోషల్ మీడియా లో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ నొచ్చుకొన్నప్పటికీ, ఆమె ధైర్యం గా సమాధానం చెప్పిన తీరుని మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్.