Varanasi: రాజమౌళి ఏం చేసినా కూడా దానికో పర్పస్ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుకు తీసుకెళ్తుందనే నమ్మకంతో రాజమౌళి ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా పాన్ వరల్డ్ లో ఇంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం 1600 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. కాబట్టి వాటిని వడ్డీతో సహా వసూలు చేయాల్సిన బాధ్యత కూడా రాజమౌళి మీదనే ఉంది. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియేట్ చేసి వాళ్ళందరిని థియేటర్ కి రప్పించే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఒకసారి ఈ సినిమాని చూస్తే కలెక్షన్స్ భారీ రేంజ్ లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి రిపీటెడ్ గా ఈ సినిమాకి ఆడియన్స్ రావాలనే ఉద్దేశ్యంతో ఇందులో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ సైతం దర్శకుడు ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంటే ఈ సినిమా మాత్రం పాన్ వరల్డ్ లో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సినిమాను వీలైనంత వరకు ప్రమోషన్స్ చేసి భారీ రేంజ్ లో ముందుకు తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమాలో ప్రభాస్ తో కూడా ఒక సన్నివేశంలో నటింపజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో మంచి మార్కెట్ ఉంది. కాబట్టి ప్రభాస్ ను ఇందులో ఆడ్ చేస్తే సినిమాకి ఎక్స్ట్రా మైలేజ్ దొరుకుతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి ప్రభాస్ ను భాగం చేసినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కేవలం రాజమౌళి మీద రెస్పెక్ట్ తోనే అతను ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…