Balakrishna And Koratala Siva: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సింది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కారణమేంటి అంటే ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందట. దానివల్లే ఈ సినిమాని చేయకూడదని బాలయ్య బాబు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమా భారీ బడ్జెట్ తెరకెక్కడం వల్ల ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ నష్టాలను మిగిల్చింది. దానివల్ల కొంతవరకు నష్టం వాటిల్లవచ్చనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ సైతం తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని చేయరాదని బాలయ్య బాబుతో చాలా క్లారిటీగా చెప్పేసారట. అందువల్లే ఈ సినిమాని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక బయటికి చెబుతున్న వార్తలు ఇవి అయినప్పటికి లోపల మాత్రం ఈ సినిమా కథ బాగున్నప్పటికి బాలయ్య బాబు ఇమేజ్ కి కొంతవరకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. దానివల్లే ఈ సినిమాని క్యాన్సల్ చేశాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కథనాలనైతే వెలువరిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఆగిపోవడం అనేది బాలయ్య బాబు అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది.
మూవీ ని తాత్కాలికంగా నిలిపివేసి మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తారా? లేదంటే మొత్తానికే ఈ సినిమాని పక్కన పెట్టేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల శివ మరో హీరోతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దేవర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన కొరటాల పాన్ ఇండియాలో మాత్రం తన సత్తా చాటుకోలేకపోయాడు.
కారణం ఏంటంటే దేవర సినిమాకి భారీ కలెక్షన్స్ రాలేదు. సినిమా యావరేజ్ హిట్ అంటూ టాక్ బయటికి వచ్చిన వెంటనే చాలామంది ఆ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఏదేమైనా కూడా కొరటాల శివ చాలా మంచి దర్శకుడు తన ఎంటైర్ కెరియర్ లో ఒక ఆచార్య మూవీని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి…