Irumudi Movie Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించడం లేదు. అయినప్పటికి రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో తనకంటూ ఏర్పాటు చేసుకున్న ఒక స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రస్తుతం అదే స్వాగ్ తో ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కథ ట్విస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…బాగా కోపంతో ఉండే రవితేజ అయ్యప్ప మాలదరిస్తాడు. అలాగే తన కూతురు కూడా మాల ను ధరిస్తుంది. ఇక ఇక ఈ క్రమంలోనే ఊర్లో కొంతమంది చిన్నపిల్లలను మర్డర్స్ చేస్తూ ఉంటారు.
అలాంటి క్రమంలోనే రవితేజ కూతుర్ని కూడా ఎవరో ఎత్తుకెళ్తారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారు? అసలు ఆ పిల్లలకు వాళ్లకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక సినిమాలోని క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. అదేంటంటే తన పక్కన ఉండే తన ఫ్రెండే విలన్ గా మారి తనకి వెన్ను పోటు పొడుస్తాడట.
తన ఫ్రెండ్ తనను వెన్నుపోటు పొడవాల్సిన పరిస్థితి ఏం వచ్చింది అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ సినిమా మీద సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది.
ఈ మూవీ ట్రైలర్ బాగుంది కాబట్టి ఈ సినిమాని చూడడానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో రవితేజ మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయగలిగే సక్సెస్ ని నమోదు చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…