Allu Arjun : పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. నాడు జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ అతడు కోలుకోలేదు. అటు భార్యని కోల్పోయి.. ఇది కొడుకు మంచానికే పరిమితం కావడంతో ఆ తండ్రి పడుతున్న వేదన మామూలుగా లేదు.
ఈ వ్యవహారంపై అప్పట్లో కేసు నమోదు అయింది. అల్లు అర్జున్ ఒకరోజు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. ఈ కేసును ఇప్పటికే అనేక పర్యాయాలు నాంపల్లి కోర్టు విచారించింది. విచారణ క్రమంలో కేసును వాయిదా కూడా వేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. కాకపోతే అతడు వేరే ప్రాంతంలో ఉండడంతో.. కీలక నిర్ణయం తీసుకున్నాడు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు సోమవారం హాజరు కావాల్సి ఉంది. అయితే అతను వేరే ప్రాంతంలో ఉండడంతో వర్చువల్ గా కోర్టు ఎదుటకు హాజరయ్యారు. ఆయనను జడ్జి అనేక రకాలుగా ప్రశ్నలు అడిగారు. వాటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. ఆ తర్వాత కేసు పూర్వా పరాలు పరిశీలించిన న్యాయమూర్తి కేసును సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేశారు. దీంతో సెప్టెంబర్ 1న విచారణ నిర్వహించి.. తీర్పు వెల్లడిస్తారా.. ఆ తీర్పులో అల్లు అర్జున్ కు ఏమైనా శిక్ష విధిస్తారా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
పుష్ప 2 సినిమా 2024 డిసెంబర్ 4న విడుదలైంది. ఆ సినిమాకు సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో కూడా వేశారు. ఆ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అప్పుడు రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను A -11 గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరోజు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. నాడు ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ కు భారత రాష్ట్ర సమితి.. వైసిపి నాయకులు సపోర్ట్ గా ఉండడం అప్పట్లో కలకలం రేపింది. అంతే కాదు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ రెండు పార్టీల నాయకులు విమర్శలు చేయడం విశేషం.