Homeఎంటర్టైన్మెంట్Agni Pareeksha 2: 'అగ్నిపరీక్ష 2' లో జడ్జీల చేత కంటతడి పెట్టించిన లేడీ కంటెస్టెంట్.....

Agni Pareeksha 2: ‘అగ్నిపరీక్ష 2’ లో జడ్జీల చేత కంటతడి పెట్టించిన లేడీ కంటెస్టెంట్.. గుండెల్ని పిండేస్తున్న ఎమోషనల్ కథ..

Agni Pareeksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లోని ఆడిషన్స్ పర్వం ఈ ఎపిసోడ్ తో ముగియనుంది. రేపటి నుండి అసలైన అగ్నిపరీక్ష మొదలు కాబోతుంది. ఈ పరీక్ష లో టాస్కులు అద్భుతంగా ఆడి , ఎక్కువ స్టార్స్ ని గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సామాన్యులు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం జనాల్లో ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లలో కొంతమంది కథలు చాలా ఎమోషనల్ […]

Agni Pareeksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లోని ఆడిషన్స్ పర్వం ఈ ఎపిసోడ్ తో ముగియనుంది. రేపటి నుండి అసలైన అగ్నిపరీక్ష మొదలు కాబోతుంది. ఈ పరీక్ష లో టాస్కులు అద్భుతంగా ఆడి , ఎక్కువ స్టార్స్ ని గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సామాన్యులు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం జనాల్లో ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లలో కొంతమంది కథలు చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. వాళ్ళ కథలు వింటుంటే ‘ఇలాంటి పరిస్థితి లో మనముంటే?’ అనే ఆలోచన రాక తప్పదు. అలాంటి ఆలోచనల్లో , మనల్ని ఒక ఎమోషనల్ ట్రామా లోకి నెట్టేసిన కంటెస్టెంట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ కంటెస్టెంట్ పేరు జోష్నా రెడ్డి. ఈమె ఒక బైక్ రైడర్, వేదిక మీదకు మంచి జోష్ తో ఎంట్రీ ఇచ్చింది.

చాలా చలాకీగా జడ్జీలతో , యాంకర్ శ్రీముఖి తో మాట్లాడింది. అలా మాట్లాడుతూనే జడ్జీలను ఒక ఎమోషనల్ ట్రామాలోకి తీసుకెళ్లింది. ఈమె మాట్లాడుతూ ‘మా నాన్న కి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం, నేను ఆయనతో టీవీ రిమోట్ కోసం చాలా కొట్లాడేదాన్ని , ప్రతీ సీజన్ చూసేవాడు, అలాంటి నాన్నకు ఈరోజు నేను ఇంత తొందరగా ఆయన ఇష్టపడే షో లోకి రావడం చూసి పైన నుండి సంతోషిస్తూ ఉంటాడు’ అని అంటుంది. దీంతో ఒక్కసారిగా జడ్జీలు షాక్ కి గురై ‘మీ నాన్నగారు చనిపోయారా ?..ఎప్పుడు? అని అడగ్గా , 2024 లో చనిపోయారు అంటూ చెప్పుకొచ్చింది జోష్నా. తన నాన్నతో కలిసి ఈమె చేసిన చిలిపి పనులు కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. ఒక సంఘటన గురించి చెప్తూ ‘ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో , నేను నాన్న ఉన్నప్పుడు , నాన్న నన్ను బీర్ తాగుతావా అని అడిగారు, తాగుతా అని చెప్పాను , అలా మేమిద్దరం ఇంట్లో కూర్చొని ఆరోజు బీర్ తాగాము’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంత ఫ్రెండ్లీ గా ఉండే నాన్న ఇప్పుడు తనతో లేరు అనేది తల్చుకుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది కదూ . చివర్లో వెళ్ళేటప్పుడు జోష్నా ని బిందు మాధవి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ నాన్న ని ఎంత మిస్ అవుతున్నావు జోష్నా ?’ అని అడగ్గా, ఆమె అందుకు సమాధానం చెప్తూ ‘ప్రతీ రోజు నేను ఆయన ఫోటో ముందు కూర్చొని , ఆయనతో నా జ్ఞాపకాలను తల్చుకుంటూ ఏడుస్తూనే ఉంటాను. ఈమధ్య నేను ఆయన గొంతుని మర్చిపోతున్నాను. మా అమ్మ ఫోన్ లో ఆయనకు సంబంధించిన వీడియోస్ ఉండేవి , కానీ ఆ ఫోన్ పోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క మాటకు జడ్జీలు మొత్తం స్తంభించిపోయారు , శ్రీముఖి కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ని చూడాలనుకుంటే , వెంటనే జియో హాట్ స్టార్ కి వెళ్లి చూడండి.

 

View this post on Instagram

 

A post shared by BB10 Telugu (@bb10buzz)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper