Paruchuri Brothers: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న వాళ్లకు మాత్రమే క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుందనేది వాస్తవం. ఇలాంటి క్రమంలోనే ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే కథ బాగుండాలి. ఆ కథని రాసే రైటర్లు సైతం ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గిపోయారు. ఎవరి సినిమాకి ఆ దర్శకులే కథలను రాసుకుంటూ సినిమాలను చేస్తున్నారు. దీనివల్ల సపరేట్ గా రైటర్లు అనేవారు లేకుండా అయిపోయారు. ఒకప్పుడు ఒక సినిమాకి దాదాపు ముగ్గురు నుంచి నలుగురు రైటర్లు కలిసి వర్క్ చేసేవారు. కొన్ని సీన్లు ఒక రైటర్ రాస్తే మరికొన్ని సీన్స్ ఇంకొక రైటర్ రాస్తుండేవాడు.
అందువల్లే అప్పట్లో సినిమా క్వాలిటీ గా వచ్చేది. చాలా కంది కథల విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు స్టోరీస్ ఎలా ఉన్నా కూడా హీరోలను ఒప్పించుకొని మేకింగ్ పరంగా సినిమాలను విజువల్ వండర్ గా తెరకెక్కించాలని చూస్తున్నారు. కానీ అది అన్ని విధాల వర్కౌట్ కాదు. మొత్తానికైతే సినిమా లో కథ ఉన్నప్పుడే అది సక్సెస్ సాధిస్తుందనే విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది.
కంటెంట్ ఇస్ కింగ్ అనే మాటను ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. ఇక ఒకప్పుడు సూపర్ హిట్ సక్సెస్ లను అందించి స్టార్ రైటర్లుగా గుర్తింపు పొందిన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, చిన్ని కృష్ణ, ఆకుల శివ లాంటి రైటర్లు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. వాళ్ళు ఒకవేళ చిన్నచితక సినిమాలు చేసిన కూడా అవేవీ పెద్దగా గుర్తింపును సంపాదించుకోవడం లేదు.
దానివల్ల ఈ రైటర్లు కొంతవరకు ఇబ్బందికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా రైటర్లను గౌరవించుకున్నప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తాయని అలాగే ఇండస్ట్రీ పది కాలాలపాటు చల్లగా ఉంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…