Homeఎంటర్టైన్మెంట్NTR Dupe: #RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఇతను ఎవరో తెలుసా..?...

NTR Dupe: #RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఇతను ఎవరో తెలుసా..? ఇతని హిస్టరీ చూస్తే నోరెళ్లబెడుతారు!

NTR Dupe: ఏ సినిమాలో అయినా కొన్ని సన్నివేశాలకు హీరోలను ఉపయోగించరు. ముఖ్యంగా రిస్క్ గా అనిపించే కొన్ని షాట్స్ ని హీరోల మీద అసలు తీయరు, వాళ్లకు బదులుగా డూప్స్ ని ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఆ హీరోల మీద వందల కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి ఉంటారు కాబట్టి, వాళ్లకు ఏదైనా జరిగితే నెలల తరబడి షూటింగ్స్ ఆగిపోతాయి కాబట్టి డూప్స్ వాడుతుంటారు. అలా #RRR చిత్రం లో అనేక షాట్స్ లో ఎన్టీఆర్(Junior […]

NTR Dupe: ఏ సినిమాలో అయినా కొన్ని సన్నివేశాలకు హీరోలను ఉపయోగించరు. ముఖ్యంగా రిస్క్ గా అనిపించే కొన్ని షాట్స్ ని హీరోల మీద అసలు తీయరు, వాళ్లకు బదులుగా డూప్స్ ని ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఆ హీరోల మీద వందల కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి ఉంటారు కాబట్టి, వాళ్లకు ఏదైనా జరిగితే నెలల తరబడి షూటింగ్స్ ఆగిపోతాయి కాబట్టి డూప్స్ వాడుతుంటారు. అలా #RRR చిత్రం లో అనేక షాట్స్ లో ఎన్టీఆర్(Junior NTR) కి డూప్ గా నటించిన వ్యక్తి అనిల్. ఒకపక్క IT ఉద్యోగం కొనసాగిస్తూనే, మరోపక్క సినిమాల్లో ఇలా డూప్ గా, లేదా జూనియర్ ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో #RRR చిత్రం లో ఎన్టీఆర్ కి డూప్ గా వ్యవహరించిన అనుభవాలను పంచుకున్నాడు అనిల్.

అనిల్ ముందుగా చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం లో రామ్ చరణ్ కి స్నేహితుడిగా నటించాడట. ఆ సమయం లోనే నాకు తెలిసింది, రాజమౌళి టీం నా కోసం నెల రోజుల నుండి ఎదురు చూసిందని అంటూ చెప్పుకొచ్చాడు అనిల్. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడం తో, మొదట్లో రామ్ చరణ్ కి డూప్ గా కొన్ని సన్నివేశాలు, అదే విధంగా ఇంటర్వెల్ సన్నివేశం లో ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని బ్యాక్ షాట్స్, కొమరం భీముడో పాటలో కూడా కొన్ని బ్యాక్ షాట్స్ లో ఎన్టీఆర్ కి డూప్ గా నటించానని చెప్పుకొచ్చాడు అనిల్. రామ్ చరణ్ సెట్స్ లో ప్రతీ ఒక్కరితో చాలా వినయంగా ఉంటాడని, జూనియర్ ఆర్టిస్టుకి కూడా ఆయన ఇచ్చే మర్యాద అప్పటి వరకు ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చాడు అనిల్.

రాజమౌళి గురించి ఆయన మాట్లాడుతూ సెట్స్ లో ఒక షాట్ ఆయన విజన్ కి తగ్గట్టుగా వచ్చే వరకు ఆయన నిద్రపోడని, ఎన్నో సన్నివేశాల్లో నాకు ఆ అనుభవం ఎదురైంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభందం గురించి చెప్తూ రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన జెప్టో యాడ్ షూటింగ్ లో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ సన్నివేశాలను అనీలే ఎన్టీఆర్ కి వివరించి చెప్పాడట. అంతే కాదు మలబార్ యాడ్ లో కూడా పెళ్లి సన్నివేశాలలో కెమెరా, లైటింగ్ సెటప్ కోసం అనిల్ నే ఉపయోగించుకున్నారు. ఇతను కేవలం స్టంట్ మ్యాన్ గా మాత్రమే కాదు, ఆచార్య తో పాటు అనేక సినిమాల్లో నటించాడు. వాటిల్లో ‘జార్జి రెడ్డి’ చిత్రం కూడా ఒకరు. ఇందులో సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిపోయాడు అనిల్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper