Allu Arjun: సోషల్ మీడియా లో అల్లు అర్జున్ కి నెగెటివిటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలిసో తెలియకో ఆయన చేసే చిన్న చిన్న పొరపాట్లు తీవ్రమైన ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , ఎన్టీఆర్ అభిమానులు అల్లు అర్జున్ చేసే ప్రతీ పొరపాటుని సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ రూపం లో ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తుంటారు. నేడు కూడా అలాంటి సందర్భమే ఒకటి ఎదురైంది. 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు , నెటిజెన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటో ని అప్లోడ్ చేశాడు . అందులోని ఎర్రకోట పై అల్లు అర్జున్ లోగో ఉంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా భగ్గుమంది.
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా నీ లోగో వేయడం అవసరమా?, అది కూడా ఎర్రకోట మీద వేశావు , ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆయనపై మండిపడ్డారు. దీంతో అల్లు అర్జున్ తాను వేసిన ఆ పోస్టు ని డిలీట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్లీ తిరిగి , కరెక్షన్స్ చేసుకొని పోస్టు ని వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు వెయ్యలేదు. దీంతో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ వైఖరి ని తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో కి సపోర్టు చేస్తూ , సోషల్ మీడియా లో తమ హీరో పై వచ్చే ట్రోల్స్ ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఏమి చేసినా భూతద్దం లో చూసి విమర్శించడం ఈమధ్య కాలం లో సర్వసాధారణం అయిపోయింది.
ఇతర హీరోలు కూడా ఇలా శుభాకాంక్షలు చెప్తే , కచ్చితంగా వాళ్లపై ఈ స్థాయిలో నెగెటివిటీ ఉండదు. కేవలం అల్లు అర్జున్ చేస్తేనే నెగెటివిటీ వస్తుంది. ఆయన ఎదుగుదల ని తట్టుకోలేకనే ఈర్ష్య తో ఇలాంటి ట్రోల్స్ వేస్తుంటారు అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ పోస్ట్ డిలీట్ చేయడం పై అల్లు అర్జున్ తర్వాత అయినా రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ తో కలిసి ‘రాకా’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుంటూ ఇండియా కి నెంబర్ 1 గా నిలిచే ప్రయత్నాలు చేస్టున్నాడు అల్లు అర్జున్.