Homeఎంటర్టైన్మెంట్Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష...

Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష పెడుతున్న డైరెక్టర్ అట్లీ..

Allu Arjun And Atlee: హాలీవుడ్ లో వేల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతున్న సినిమాలు , కేవలం ఏడాది సమయం లోనే షూటింగ్ ని పూర్తి చేసుకొని మన ముందుకు వస్తున్నాయి. కానీ మన టాలీవుడ్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్టార్ హీరోలు ఒక మీడియం రంగబడ్జెట్ సినిమాని పూర్తి చేయడానికే రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు అయితే లెక్కే లేదు. ఎప్పుడు మొదలు అవుతుందో , ఎప్పుడు […]

Allu Arjun And Atlee: హాలీవుడ్ లో వేల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతున్న సినిమాలు , కేవలం ఏడాది సమయం లోనే షూటింగ్ ని పూర్తి చేసుకొని మన ముందుకు వస్తున్నాయి. కానీ మన టాలీవుడ్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్టార్ హీరోలు ఒక మీడియం రంగబడ్జెట్ సినిమాని పూర్తి చేయడానికే రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు అయితే లెక్కే లేదు. ఎప్పుడు మొదలు అవుతుందో , ఎప్పుడు విడుదల అవుతుందో , 50 శాతం పూర్తి అయ్యాక కూడా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నటువంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ‘రాకా’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది లోనే ఎట్టి పరిస్థితిలో పూర్తి చెయ్యాలని అల్లు అర్జున్ అట్లీ కి ఒక డెడ్ లైన్ పెట్టాడు. కానీ పూర్తి అవ్వడం దాదాపుగా అసాధ్యం లాగానే అనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేందుకు మరో 130 రోజులు పడుతుందట. అన్ని వర్కింగ్ డేస్ ఒకే షెడ్యూల్ లో అయితే జరగదు కదా?, వివిధ షెడ్యూల్స్ గా విభజించి చేస్తారు. షెడ్యూల్ కి షెడ్యూల్ కి మధ్య ఎన్ని రోజుల గ్యాప్ ఉంటుందో తెలియదు. పైగా రీ షూట్స్ కూడా ఉంటాయి. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ప్రాక్టికల్ గా ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమే. అల్లు అర్జున్ ఒత్తిడి కారణంగా డైరెక్టర్ సినిమాని చుట్టేస్తే తప్ప, ఈ సినిమా ఈ ఏడాదిలో పూర్తి అవ్వదు.

ఒక విధంగా అల్లు అర్జున్ కూడా డైరెక్టర్ అట్లీ తీస్తున్న ఔట్పుట్ పై పూర్తి స్థాయి సంతృప్తికరంగా లేదట. ఇదంతా పక్కన పెడితే , ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు అట. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతుందట. ఈ భారీ షెడ్యూల్ తో దీపికా కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, జాన్వీ కపూర్ , మృణాల్ ఠాకూర్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మొదటిసారి ఈ సినిమా ద్వారా విలన్ గా పరిచయం కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper