Nag Ashwin Kalki 2 : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… తీసింది తక్కువ సినిమాలే అయిన కూడా లోకేష్ యూనివర్సల్ అంటూ తనను తాను చాలా గొప్పగా పరిచయం చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం రజినీకాంత్ తో చేసిన ‘కూలీ’ సినిమాతో భారీగా దెబ్బతిన్న ఆయన ఇప్పుడు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో ‘డిసి’ అనే సినిమాతో ప్రేక్షకులందరిని అలరించాడు. మొదటిసారి తను హీరోగా కనిపించడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో లోకేష్ కనకరాజు హీరోగా కూడా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన కొన్ని కీలకమైన పాత్రలో కనిపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం డిసి సినిమానైతే చూశాడు.
ఇక తను ‘కల్కి 2’ ఒక కీలకమైన పాత్ర కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నాడట. లోకేష్ కనకరాజు యాక్టింగ్ చూసిన తర్వాత ఆ పాత్రకి లోకేష్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడు అంటూ అతనితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమాలో తను ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజు ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు. నాగ్ అశ్విన్ సైతం దీనిని స్పందించలేదు. కాబట్టి నిజంగానే లోకేష్ కల్కి 2 నటిస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ కేటాయించాలని చూస్తున్నాడు. మధ్యలో యాక్టింగ్ కోసం వెళితే తను డైరెక్ట్ చేసే సినిమాకి ఇబ్బంది కలుగవచ్చనే ధోరణిలో కూడా కొన్ని ఆలోచనలైతే చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు దర్శకుడిగా, హీరోగా రాణిస్తూ ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు…