Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ షో లో రోహిత్ తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది రామ కృష్ణ మాత్రమే. మొదట్లో రామ కృష్ణ కి అసలు గుర్తింపు ఉండేది కాదు. ఇతన్ని ఆడిషన్స్ లో ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ చివరి మూడు ఎపిసోడ్స్ లో రామ్ కృష్ణ కి క్రేజ్ మామూలు రేంజ్ లో రాలేదు. చాలా మంచి అబ్బాయి, ఇలాంటోడు బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిందే అని నెటిజెన్స్ సైతం గట్టిగా కోరుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ రామకృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ప్రేక్షకుల నుండి ఆయనకు భారీ రేంజ్ లో ఓటింగ్ పడింది.
అయినప్పటికీ కూడా బిగ్ బాస్ టీం రికమండేషన్ కోటా లో వాళ్లకు కావాల్సిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారని , ఇది అసలు కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తప్పుబట్టారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే రామకృష్ణ ‘బిగ్ బాస్ 7’, ‘బిగ్ బాస్ 8’ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న టేస్టీ తేజ తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ప్రేక్షకుల హృదయాల్ని పిండేసే రేంజ్ లో ఉన్నాయి. ఇలాంటి కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం అసలు ఎలా వదులుకుందా అర్థం కావడం లేదని అంటున్నారు నెటిజెన్స్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రామకృష్ణ కి మొదటి నుండి పోలీస్ జాబ్ కొట్టాలనే కోరిక ఉంది. దాని కోసం ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లే వాళ్ళు టాటూలు వంటివి వేసుకోకూడదు. అలాంటివి వేసుకుంటే జీవితం లో మళ్లీ పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కుదరదు.
అయితే రామకృష్ణ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఎలా అయినా ఎంట్రీ ఇవ్వాలనే కసితో , ‘తు నా బ్రతుకు’ అనే టాటూ ని వేసుకున్నాడు. ఈ కారణం చేత , ఇక రామకృష్ణ పోలీస్ జాబ్ కల కలగానే మిగిలిపోయిందని ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇలా తన కెరీర్ ని పణంగా పెట్టినప్పటికీ కూడా రామకృష్ణ ‘బిగ్ బాస్ 10’ లో అవకాశం రాలేదు. ఒకవేళ ఆయన్ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంచుకోకుంటే, ‘అగ్ని పరీక్ష 2’ జడ్జీలు రామకృష్ణ జీవితాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తులుగా నిలిచిపోతారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బిగ్ బాస్ టీం రామకృష్ణ కి బదులుగా , మితిలేష్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. ఇదే కనుక జరిగితే రామకృష్ణ జీవితం నాశనం అయ్యినట్టే , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.