Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కి కంటెంట్ కింగ్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు త్రిగున్ . సోషల్ మీడియా లో తెలుగు యువత ఈయన్ని ‘త్రిగుణన దూత’ అని పిలుస్తున్నారు. ‘బిగ్ బాస్ 10’ మొదలై కేవలం 3 రోజులు మాత్రమే అయ్యింది. ఈ మూడు రోజుల్లో త్రిగున్ 30 ఎపిసోడ్స్ కి సరిపడా కంటెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే ఆయన నుండి నెగెటివ్ కంటెంట్ మాత్రమే బయటకు వస్తోంది. కానీ అతని వల్ల ఎదో ఒక కంటెంట్ వస్తుంది కదా అని సపోర్టు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే త్రిగున్ తన యాటిట్యూడ్ ని మార్చుకోకుంటే, కచ్చితంగా ఘోరమైన నెగెటివిటీ ని ఎదురుకోవడమే కాదు, నాగార్జున నుండి రెడ్ కార్డు ఎలిమినేషన్ ని కూడా ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే త్రిగున్ ప్రవర్తన ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పేది ఏమిటంటే, ఇతను సంజన + రేవంత్ కి మిక్స్ లాగా ఉన్నాడని. ఎదో సరదాకి మాత్రమే ఇది సోషల్ మీడియా లో అన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే , రేవంత్ ఇతనికి దూరపు బంధువు అవుతాడట. వీళ్లిద్దరి మధ్య చాలా మంచి రిలేషన్ కూడా ఉందట. ఇతనిలో రేవంత్ లక్షణాలు ఉన్నాయేంటి అని అంతా అనుకుంటున్నా సమయం లో , రేవంత్ నిజ జీవితం లో ఇతనితో రక్త సంబంధం కలిగి ఉన్నాడు అనే నిజాన్ని తెలుసుకొని సోషల్ మీడియా లో నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. త్రిగున్ కి కూడా టైటిల్ విన్నర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి , కానీ ఆయన రోహిత్ ని టార్గెట్ చేయడం పూర్తిగా ఆపేయాలి , అప్పుడే టైటిల్ విన్నర్ రేస్ కి దగ్గర అవుతాడని అంటున్నారు నెటిజెన్స్. మరి త్రిగున్ తన బంధువు రేవంత్ లాగా టైటిల్ విన్నర్ అవుతాడా , లేదా రన్నర్ గా మిగిలిపోతాడు అనేది రాబోయే రోజుల్లో చూడాలి.