Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' నుండి టెంపర్ వంశీ అవుట్..12 వారాలకు...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి టెంపర్ వంశీ అవుట్..12 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఒకరు టెంపర్ వంశీ. ఈయన సినిమాల్లో ఎంత పెద్ద పాపులర్ విలన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో కలిసి నటించాడు. అంతటి టాప్ ప్రొఫైల్ ఉన్న కంటెస్టెంట్ కావడంతో హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఒకరు టెంపర్ వంశీ. ఈయన సినిమాల్లో ఎంత పెద్ద పాపులర్ విలన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో కలిసి నటించాడు. అంతటి టాప్ ప్రొఫైల్ ఉన్న కంటెస్టెంట్ కావడంతో హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కచ్చితంగా తన మార్కు చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే అతని గేమ్ మొత్తం త్రిగున్ షాడో లాగానే సీజన్ మొత్తం నడిచింది. తనకంటూ ప్రత్యేకమైన గురింపు ని సంపాదించుకోలేకపోయాడు. పైగా ఆడియన్స్ లో ఎలాగైనా రిజిస్టర్ అవ్వాలనే తపనతో గట్టిగా అరవడం వంటివి చేస్తూ వచ్చేవాడు. ముఖంగా నీతూ మాస్టర్ తో అయితే ఒక రౌడీ లాగానే ప్రవర్తించేవాడు. ఇవన్నీ వంశీ కి మైనస్ పాయింట్స్.

త్రిగున్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల కొన్ని వారాలు నెట్టుకొచ్చాడు కానీ,ఇప్పటి వరకు వంశీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఈ వారం త్రిగున్ తో పాటు వంశీ కూడా నామినేషన్స్ లో ఉండడం తో, త్రిగున్ ఓట్లు త్రిగున్ కి మాత్రమే పడింది, వంశీ కి డివైడ్ అవ్వలేదు, దీంతో ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. హౌస్ లో 12 వారాలు ఉన్నందుకు గానూ వంశీ 36 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అంటే వారానికి మూడు లక్షల రూపాయిలు అన్నమాట. ఇది చిన్న మొత్తం కాదనే చెప్పాలి. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన 80 రోజుల్లో ఈ రేంజ్ డబ్బులు సంపాదించి ఉండదు. ఇక ఆడియన్స్ కి అయితే ఎదో ఒక రూపం లో బాగా దగ్గరయ్యాడు. కేవలం బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ వల్ల, వంశీ కి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన టాప్ స్టార్. బిగ్ బాస్ లేకపోయినా అతనికి అవకాశాలు భారీగానే వస్తాయి.

కాకపోతే ఈ బిగ్ బాస్ జర్నీ వంశీ కి ఒక సరికొత్త అనుభూతి అని చెప్పొచ్చు. ఇకపోతే వంశీ తో పాటు వర్షిణి కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. ఈమె ఎప్పుడో రెండవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ బిగ్ బాస్ టీం ఈమెని కాపాడుకుంటూ వచ్చింది అనే ఆరోపణలు సోషల్ మీడియా లో చాలానే ఉన్నాయి. 10 వారాల కాంట్రాక్టు బిగ్ బాస్ టీం తో వర్షిణి కుదిరించుకుందని, అందుకే ఆమెకు ఎంత తక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ అవ్వదని నెటిజెన్స్ అంటూ ఉండేవారు. వాళ్ళు చెప్పినట్టుగానే వర్షిణి విజయవంతంగా 10 వారాలకు పైగా హౌస్ లో కొనసాగింది. ఇప్పుడు కాంట్రాక్టు ముగియడం తో ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే 12 వారాలు హౌస్ లో ఉన్నందుకు గానూ వర్షిణి దాదాపుగా 40 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. అలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో వీళ్లిద్దరు హౌస్ నుండి వెళ్లిపోయారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper