Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా?? బయటపడ్డ సంచలన నిజం!

Bigg Boss 10 Telugu: రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా?? బయటపడ్డ సంచలన నిజం!

Bigg Boss 10 Telugu: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇంతకుముందు హౌస్ లోని కంటెస్టెంట్స్ ఓట్లతో నెంబర్ 1 పబ్లిక్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని ఎప్పుడు ఎలిమినేట్ చేయలేదు. మొట్టమొదటిసారి ఈ సీజన్ లో అలాంటి సాహసం చేశారు. మొదటి వారం నుండి ప్రస్తుత వారం వరకు తిరుగులేని ఓటింగ్ తో , ఎవ్వరికీ అందనంత రేంజ్ లో కొనసాగుతూ వచ్చిన రోహిత్ ని , చాలా క్యాజువల్ గా హౌస్ మేట్స్ […]

Bigg Boss 10 Telugu: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇంతకుముందు హౌస్ లోని కంటెస్టెంట్స్ ఓట్లతో నెంబర్ 1 పబ్లిక్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని ఎప్పుడు ఎలిమినేట్ చేయలేదు. మొట్టమొదటిసారి ఈ సీజన్ లో అలాంటి సాహసం చేశారు. మొదటి వారం నుండి ప్రస్తుత వారం వరకు తిరుగులేని ఓటింగ్ తో , ఎవ్వరికీ అందనంత రేంజ్ లో కొనసాగుతూ వచ్చిన రోహిత్ ని , చాలా క్యాజువల్ గా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేశారు. ఎప్పటి నుండో రోహిత్ ని టార్గెట్ చేసి , అవకాశం వస్తే అతన్ని బయటకు నెట్టేయాలి అనే కసితో ఉన్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ , నిన్న ఆ అవకాశం రాగానే బయటకు నెట్టేశారు. అంతే కాదు అతను వెళ్ళిపోతున్న సమయంలో నీతూ మాస్టర్ తప్ప ఒక్కరు కూడా బాధపడలేదు. ఎన్ని గొడవలు జరిగినా ఎలిమినేట్ అయ్యాక కంటెస్టెంట్స్ బాధపడతారు.

కానీ రోహిత్ ఎలిమినేట్ అయితే త్రిగున్ వంటి వారు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి స్నేహితుడిగా ఉంటూ వచ్చిన అమన్ కూడా బాధపడలేదు. అంతే కాకుండా, రోహిత్ ఎలిమినేట్ అయ్యేందుకు ఓటు వేసిన వారిలో అమన్ కూడా ఒక్కడు. ఇంతటి దారుణమైన వెన్నుపోటు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ కూడా జరగలేదు. ప్రతీ చిన్న దానికి రోహిత్ సలహా లేకుండా గేమ్ ఆడే అమన్ , గత వారం లో జరిగిన చిన్న గొడవని మనసులో పెట్టుకొని , రోహిత్ కి శత్రువుగా మారడం అత్యంత దారుణమైన విషయమని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా?, లేదంటే టీఆర్ఫీ రేటింగ్స్ స్టంట్ కోసం అతన్ని వాడుకుంటున్నారా?.. నాగార్జున సీక్రెట్ రూమ్ ఆఫర్ చేస్తే , రోహిత్ దాన్ని రిజెక్ట్ చేసినట్టు చాలా వార్తలు వచ్చాయి.

నాగార్జున బ్రతిమిలాడినా, బిగ్ బాస్ టీం బ్రతిమిలాడినా కూడా రోహిత్ ఒప్పుకోలేదని , బయటకు వచ్చేసాడని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ అలాంటిదేమి జరగలేదు. చాలా సింపుల్ గా హౌస్ మేట్స్ ఇతను ఎలిమినేట్ అవ్వాలని ఓటు వెయ్యడం , రోహిత్ బయటకు రావడం వంటివి జరిగాయి. అయితే ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ ఉంది. రోహిత్ కేవలం ఆడియన్స్ దృష్టిలో , హౌస్ మేట్స్ దృష్టిలో మాత్రమే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ టీం దృష్టిలో ఎలిమినేట్ అవ్వలేదు. ఎందుకంటే రోహిత్ ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉన్నాడు. అతన్ని ఒక హోటల్ లో ఉంచారు. చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వలేదు, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడించలేదు. ఒక హోటల్ రూమ్ లో ఉంచిపెట్టారు. సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి ముసుగేసి జాగ్రత్తగా బయటకు కారులో తీసుకొస్తారు. కానీ రోహిత్ కి అది జరగలేదు. ఇప్పటికీ ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉన్నాడు.

దీని అర్థం బిగ్ బాస్ టీం రోహిత్ రీ ఎంట్రీ ని ఈ వారం లోనే చేయించబోతున్నట్టు తెలుస్తోంది. పైగా ఈ వారం థీమ్ కి కూడా ‘రివార్డ్స్ అండ్ రివెంజ్’ అనే టైటిల్ పెట్టారు. ‘రివెంజ్’ అని పెట్టారు కాబట్టి , రోహిత్ చేతిలో ఒక అల్టిమేట్ పవర్ పెట్టి , హౌస్ లోకి పంపించబోతున్నారా అనే సందేహాలు ఆడియన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ప్రతీ వారం లాగానే, ఈ వారం కూడా రెండు రోజులు జరగబోతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రోహిత్ ని హౌస్ లోకి పంపబోతున్నారా ? అనేది చూడాలి. ఒకవేళ రోహిత్ ని ‘అల్టిమేట్ పవర్’ తో లోపలకు పంపితే , ఎవరిని టార్గెట్ చేస్తాడు?, తన శత్రువులైన త్రిగున్, శివ్ లను టార్గెట్ చేస్తాడా?, లేదంటే నమ్మక ద్రోహం చేసిన అమన్ ని టార్గెట్ చేస్తాడా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper