Homeఆంధ్రప్రదేశ్‌MLC anantababu: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కథ ఇప్పుడే మొదలైంది..

MLC anantababu: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కథ ఇప్పుడే మొదలైంది..

MLC anantababu: వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు సాగించిన దారుణం అప్పట్లో సంచలనంగా మారింది. నాడు వైసిపి అధికారంలో ఉండడంతో అనంత బాబు మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా నాడు వ్యవస్థలు మొత్తం ఆయనకు వ్యవహరించాయి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉండడంతో అనంతబాబు అసలు కథలు అనంతంగా వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంత బాబు ఒక ఘోరానికి పాల్పడిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు.. హైకోర్టు అత్యంత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో రాజమండ్రిలో ఎస్సీ, ఎస్టి […]

MLC anantababu: వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు సాగించిన దారుణం అప్పట్లో సంచలనంగా మారింది. నాడు వైసిపి అధికారంలో ఉండడంతో అనంత బాబు మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా నాడు వ్యవస్థలు మొత్తం ఆయనకు వ్యవహరించాయి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉండడంతో అనంతబాబు అసలు కథలు అనంతంగా వెలుగులోకి వస్తున్నాయి.

ఎమ్మెల్సీ అనంత బాబు ఒక ఘోరానికి పాల్పడిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు.. హైకోర్టు అత్యంత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో రాజమండ్రిలో ఎస్సీ, ఎస్టి ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెప్టెంబర్ 11 నుంచి అనంత బాబు కేసులో రోజువారి విచారణ మొదలుపెడుతుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంత బాబు ఉన్నారు. ఆయన భార్య పాత్ర పై కూడా పోలీసులు అనేక రకాలుగా అభియోగాలు నమోదు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణ ప్రక్రియను హైకోర్టు పర్యవేక్షించనుంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో మే నెలలో కాకినాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. అనంత బాబు వద్ద వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు డ్రైవర్ గా పనిచేసేవాడు. అతడిని దారుణంగా హతమార్చాడు అనంతబాబు. పైగా దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వయంగా కారులో తీసుకువచ్చాడు. సుబ్రహ్మణ్యం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయాడు. అప్పట్లో ఈ సంఘటన దుమారం రేపింది. ప్రజాసంఘాలు.. విపక్షాలు ఆందోళనలు చేయడంతో అనంత బాబు మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ.. ఇంకా అనేక రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరు.. చార్జి సీట్లు దాఖలు చేసిన విషయంలో జపం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో అనంత బాబుకు డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా పోలీసులు కృషి చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విచారణ ప్రక్రియను ఆలస్యం చేయకూడదని హెచ్చరించింది. దీనికి హైకోర్టు కూడా జత అయింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ న్యాయవాది పర్యవేక్షణలో గడువులో గానే ట్రయల్ ముగించాలని.. స్టే ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాజమండ్రి కోర్టు సెప్టెంబర్ 11 నుంచి ఏకధాటిగా రోజువారీగా సాక్షుల వాంగ్మూలాలను.. ప్రాసిక్యూషన్ ఆధారాలను పరిశీలించనుంది. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ను బలోపేతం చేసింది. అందువల్లే ప్రత్యేకమైన న్యాయవాదిని నియమించింది. మరోవైపు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో.. అనంత బాబు బెయిల్ రద్దు అయింది. ప్రస్తుతం అతను జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper