Homeఎంటర్టైన్మెంట్Rajamouli : రాజమౌళి కోసం రాసిన కథను విజయేంద్రప్రసాద్ ఆ స్టార్ డైరెక్టర్ కి ఇస్తున్నాడా...

Rajamouli : రాజమౌళి కోసం రాసిన కథను విజయేంద్రప్రసాద్ ఆ స్టార్ డైరెక్టర్ కి ఇస్తున్నాడా…

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఏం చేసిన కూడా అదొక అద్భుతంగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటే ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కథను ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఒక స్టోరీకి తను ఫిక్స్ అయ్యాడు అంటే ఆయన అదే కథతో ట్రావెల్ చేస్తూ […]

Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఏం చేసిన కూడా అదొక అద్భుతంగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటే ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కథను ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఒక స్టోరీకి తను ఫిక్స్ అయ్యాడు అంటే ఆయన అదే కథతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అందులో ఎలాంటి హై మూమెంట్స్ ని మనం యాడ్ చేయవచ్చు. ఎక్కడ సినిమాని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయొచ్చు. ఎమోషనల్ గా ఎంత బ్యాలెన్స్ గా ఉండాలి. ఎలివేషన్స్ ఎప్పుడు పడాలి అనేది ఆయనకు తెలిసినంత గొప్పగా ఇంకేవ్వరికి తెలియదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

రాజమౌళి ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా కథని వాళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ గారి అందించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న ‘వారణాసి’ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండటం విశేషం. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చాలా ఇష్టంతో రాయించుకున్న ఒక కథను విజయేంద్రప్రసాద్ ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ కి ఇస్తున్నారట…

రాజమౌళి ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో ఆ కథని చేసే ఆస్కారం లేకపోవడంతో ఆయన ఆ కథని శంకర్ కి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు. మన ఇండియన్స్ బ్రిటిష్ వాళ్లకి ఎందుకోసం హెల్ప్ చేశారనే పాయింట్ తో ఫిక్షనల్ స్టోరీ ని రెడీ చేసారట. శంకర్ మొదటి నుంచి కూడా అలాంటి సబ్జెక్టులు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.

కాబట్టి ఆ సినిమా కథని తను తీసుకొని తొందరలోనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకుంటాడనే విషయంలో ఇంకా క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా కథని శంకర్ తీసుకోవడానికి రాజమౌళి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper